Lunar eclipse 2024: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం తెస్తుంది ఈ రాశులకు లక్ష్మీకటాక్షం!!
2024 సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం మార్చి నెల 25వ తేదీన ఉదయం 10.23 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 02 నిమిషాలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అయితే జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం గ్రహణాలు ఏవైనా అన్ని రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తే కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుత మనం చంద్ర గ్రహణం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి తెలుసుకుందాం. చంద్రగ్రహణం ముఖ్యంగా మూడు రాశులకు మేలు చేస్తుంది. మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి వారికి చంద్రగ్రహణం అదృష్టాన్ని ఇస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

మేషరాశి
చంద్రగ్రహణం కారణంగా మేష రాశి వారికి లబ్ధి జరుగుతుంది .మేష రాశిలో జన్మించిన వారికి ఈ చంద్రగ్రహణం శుభప్రదంగా పరిణమిస్తుంది. ఈ సమయంలో చేసే ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో ఏ పని చేసిన విజయాలు సాధించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఆస్తిని లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. చంద్ర గ్రహణ శుభ ప్రభావాలు మీకు గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెడతాయి. ఆర్థికపరమైన అంశాలలో ఏ ప్రయత్నం చేసినా ఈ సమయంలో మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగుగా ఉంటుంది
కన్యారాశి
చంద్రగ్రహణం కారణంగా కన్యారాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కన్యారాశిలో ఉన్న నిరుద్యోగులకు ఈ సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో కన్యా రాశి వారి వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. మీ ప్రభావవంతమైన వాక్చాతుర్యం ఇతరుల పైన శాశ్వతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. భాగస్వామ్య వ్యాపార ప్రయత్నాలలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ పని చేసినా కన్యా రాశి వారికి కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications