త్వరలో చంద్ర గ్రహణం.. ఈ రాశులవారికి కుబేర యోగం!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాగే సెప్టెంబర్ మాసానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సంవత్సరం రెండవ మరియు చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడబోతుంది. కుంభ రాశి లో, పూర్వ భాద్రపద నక్షత్రంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.
చంద్ర గ్రహణం
ఇక ఇదే సమయంలో గ్రహణకాలంలో కుంభరాశిలో సూర్య చంద్రుల కలయిక జరుగుతుంది. ఇక చంద్రగ్రహణం ఏర్పడుతున్న సమయంలో చోటు చేసుకునే ఖగోళ పరిణామాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాయి. చంద్రగ్రహణం వేళ అదృష్టవంతులు అవుతున్న ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి చంద్రగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. మేష రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. మునుపటి కంటే ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఈ సమయంలో బలంగా ఉంటారు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.
మిధున రాశి
చంద్రగ్రహణం కారణంగా మిధున రాశి వారి సానుకూల ఫలితాలను పొందుతారు. చంద్రగ్రహణ ప్రభావంతో వీరు ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఆరోగ్య సంబంధ సమస్యలను అధిగమిస్తారు. పెట్టిన పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయి. ఇది వీరికి కలిసొచ్చే కాలం.
కన్యారాశి
కన్యా రాశి వారు చంద్రగ్రహణం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. సంతానం నుండి సహాయ సహకారాలు అందుతాయి.
వృశ్చిక రాశి
చంద్రగ్రహణం కారణంగా వృశ్చిక రాశి జాతకులు మంచి ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారి ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వస్తువులు, వాహనాలు, ఇల్లు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సంతోషం పెరుగుతుంది.
ధనస్సు రాశి
చంద్రగ్రహణం కారణంగా ధనుస్సు రాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు. ఈ సమయంలో వీరి సంపద పెరుగుతుంది. తోబుట్టువుల సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు ఆర్థిక పురోగతిని సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications