రాఖీ పండుగనాడే చంద్రగ్రహణం.. ఈ రాశులవారికి సంపదల వర్షం!
2026లో రెండో చంద్రగ్రహణం ఆగస్టు 28న రక్షా బంధనం రోజున సంభవించనుంది. ఇది కుంభ రాశి శతభిష నక్షత్రంలో, రాహువుకు సంబంధించిన శతభిష నక్షత్రంలో జరుగుతుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి సూతక కాలం ఉండదు. అయితే సహజంగా గ్రహణాలు ప్రతికూల ప్రభావాలను కలిగించేవే అయినా, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిపై అనుకూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మేష రాశి:
మేష రాశి వారికి ఈ గ్రహణం అనేక విధాలుగా లాభదాయకం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికావచ్చు. కుటుంబంలో సంతోషం, నెమ్మది పెరుగుతుంది. ఆర్థికంగా కొత్త అవకాశాలు రావచ్చు. విదేశాలకు సంబంధించిన ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు కనిపించవచ్చు. నాయకత్వ లక్షణాలు బలపడతాయి. ఇది మేషరాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి వృత్తి, ఆర్థిక రంగాల్లో మంచి ఫలితాలు. బడ్జెట్ లేదా వేతన పెంపు, కొత్త కస్టమర్లు రావచ్చు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు, వ్యాపార అవకాశాల ద్వారా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొనవచ్చు.
కన్య రాశి:
కన్య రాశి వారికి కొత్త పరిచయాలతో సమస్యలు పరిష్కారం కావచ్చు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ప్రశంసలు, అనూహ్య ఆర్థిక లాభాలు రావచ్చు. ఈ కాలంలో అదృష్టం తోడుగా ఉంటుందని జ్యోతిష్యులు అభిప్రాయపడుతున్నారు.
మకర రాశి:
మకర రాశి వారికి చంద్రగ్రహణం నాడు అందునా రక్షా బంధన్ నాడు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చు. కొత్త ఒప్పందాలు, వ్యాపార అవకాశాలతో లాభాలు రావచ్చు. కుటుంబంతో సమయం గడపడం, సామాజిక స్థానం మెరుగుపడటం కనిపిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఇది మకరరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది.
తులా రాశి:
తుల రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయాలు, శుభవార్తలు వినిపించవచ్చు. వ్యాపారులకు లాభదాయక ఒప్పందాలు, ఆదాయం పెరిగే మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో పురోగతి వస్తుంది. పిల్లల విషయంలో మంచి వార్తలు రావచ్చు. ఇది తులారాశి వారికి అన్ని విధాలా అదృష్టాన్ని ఇచ్చే కాలం.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications