హోలీనాడు చంద్రగ్రహణం.. భద్రుని నీడ.. ఈ రాశులవారికి కష్టాలు!

హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటాం. హోలీ పండుగ రోజున దేశవ్యాప్తంగా రంగుల కోలాహలం కనిపిస్తుంది. చిన్న పెద్ద, పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంబరాల హోలీని జరుపుకుంటారు.

హోలీ నాడు చంద్రగ్రహణం
ఈ సంవత్సరం హోళికా దహనం సమయంలో భద్రుని నీడ ఉండబోతుంది. హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ భద్రుని నీడలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుండడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి కష్టాలు రాబోతున్నాయి మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Lunar eclipse on Holi along with the shadow of Bhadra troubles for these zodiac signs

మిధున రాశి
హోలీ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా మిధున రాశి వారికి ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ సమయంలో మిధున రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం పట్టే సమయం వీరికి ప్రతికూలతలను తెస్తుంది. ఆస్తులకు సంబంధించి, డబ్బులకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులను వీరు ఎదుర్కొంటారు. కుటుంబంలో సమస్యలు వస్తాయి కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి
హోలీ రోజు ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా వృశ్చిక రాశి వారి జీవితంలో కష్టాలు, నష్టాలు వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది. అలాకాకుంటే వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పొరపాటున కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

మకర రాశి
హోలీ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా మకర రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కెరీర్లో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆదాయం తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. ఉద్యోగం చేసే చోట అధికారులతో, సహ ఉద్యోగులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.

మీన రాశి
హోలీ నాడు చంద్రగ్రహణం కారణంగా మీనరాశి జాతకులు ఇబ్బందులు పడతారు. మీన రాశి వారు డబ్బు ఆదా చేయడంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఈ సమయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+