మార్చి 3న సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారు చేయాల్సిన పనులు ఇవే
వచ్చే నెల 3వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. అయితే మన దేశంలో ఇది చాలా పాక్షికంగా కనపడుతుంది. చైనా, సింగపూర్ లాంటి దేశాల్లో మాత్రం పూర్తిగా కనపడుతుంది. జ్యోతిష్య పండితులు చెబుతున్నదాని ప్రకారం మనదేశంలో గ్రహణం విడుపు మాత్రమే కనపడుతుందంటున్నారు. సాయంత్రం 6.20 గంటల నుంచి 27 నిముషాలే కనిపిస్తుంది. గ్రహణం మంగళవారం రోజు పుబ్బ నక్షత్రంలో సింహరాశిలో సంభవిస్తోంది. విశ్వావసు నామ సంవత్సరంలో ఏర్పడుతున్న చివరి చంద్ర గ్రహణం ఇదే. ఆలయాల మూసివేతతోపాటు గ్రహణ శాంతులు చేయడం, పవిత్ర స్నానాల్లాంటివన్నీ ఆచరించాలి. ఇంట్లో ఉండేవారు మధ్యాహ్నం 12.00 గంటల్లోపు భోజనం చేస్తే మంచిది.
ఆహార పదార్థాలపై దర్భలు వేయాలి
ఈ చంద్రగ్రహణం సింహరాశిలో సంభవిస్తోంది. ఈ రాశివారు గ్రహణాన్ని చూడకూడదు. సింహ రాశితో పాటు మేషం, మీనం, ధనుస్సు, వృశ్చిక, కన్య, కుంభ, కర్కాటక, మకర రాశుల వారిపై కూడా కొంత గ్రహణ ప్రభావం ఉందని, ఇది వ్యతిరేకతను కలిగిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇంట్లో ఆహార పదార్థాలపై దర్భలు వేయాలి. గ్రహణం అయిపోయిన తర్వాత పాత ఆహారాన్ని పారవేసి కొత్త ఆహారాన్ని వండుకొని తినాలి. గర్భిణీలు నేరుగా చంద్రుడిని చూడకూడదు. అలాగే పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.

మంత్రాలు పఠించాలి
సూతక కాలం మొదలైనప్పటి నుంచి దేవాలయాలు మూసివేస్తారు. ఇంట్లో కూడా విగ్రహాలను తాకకూడదు. గ్రహణ సమయంలో చేసే జపానికి కోటి రెట్లు ఫలితం ఉంటుందని అంటారు. ముఖ్యంగా 'ఓం నమో నారాయణాయ' లేదా 'ఓం నమః శివాయ' వంటి మంత్రాలు పఠించడం శుభప్రదం. గ్రహణం ప్రారంభానికి ముందు, తర్వాత గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసి, గంగాజలం చల్లుకోవాలి. శక్తి కొలది పేదలకు బియ్యం, గోధుమలు లేదా వస్త్రాలను దానం చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఆలయాలను సంప్రోక్షణ చేసిన తర్వాత మాత్రమే భక్తులను అనుమతిస్తారు. తిరుమలలో సాయంత్రం 7.30 గంటల వరకు ఆలయం మూసివుంటుంది.












Click it and Unblock the Notifications