Lunar eclipse2023: శారద పూర్ణిమతో చంద్రగ్రహణం; 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!!
ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28 మరియు అక్టోబర్ 29 తేదీల మధ్య అర్ధరాత్రి 1.06 నిమిషాల నుండి 2 గంటల 24 నిమిషాల వరకు ఏర్పడనుంది.భారతదేశంలో ఈసారి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కావడంతో సూతక కాలాన్ని పాటించాలని చెబుతున్నారు. చంద్రగ్రహణం ప్రారంభమయ్యే తొమ్మిది గంటల ముందు నుండి సూతక కాలాన్ని పాటించాలి.
ఈసారి శారదపూర్ణిమతో కూడిన చంద్రగ్రహణం ఏర్పడడంతో చంద్ర గ్రహణాన్ని చాలా ప్రత్యేకంగా చెబుతారు. శారద పూర్ణిమకు హిందూ విశ్వాసాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 30 సంవత్సరాల తర్వాత శరత్ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మరి ఆ అదృష్ట రాశులవారు ఎవరు మనం ప్రస్తుతం తెలుసుకుందాం.

2023వ సంవత్సరంలో శారద పూర్ణిమలో చంద్రగ్రహణం ఏర్పడడం ఒక అరుదైన ఖగోళ సంఘటన. ఈ సంఘటన ముఖ్యంగా ఐదు రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులను తెస్తుంది. వీరికి చెప్పలేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి రాశులలో మేషరాశి ఒకటి. వీరికి ఈ సమయంలో ఆర్థిక పురోగతి కలుగుతుంది. మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ సత్ఫలితాలను ఇస్తాయి.
శరత్ పూర్ణిమ లో చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహ రాశి జాతకులు వ్యక్తిగత జీవితంలో, వృత్తిపర జీవితంలో పురోగతి కనిపిస్తుంది. సింహరాశి జాతకుల ఎదుగుదలకు ఈ పరిణామం మార్గాన్ని సుగమం చేస్తుంది.తులారాశి వారికి శరత్ పూర్ణిమలో ఏర్పడే చంద్రగ్రహణం మెరుగైన ప్రయోజనాలను కలిగిస్తుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన సామరస్యాన్ని ఇది బలోపేతం చేస్తుంది. ఇది మీ జీవితాన్ని శ్రేయస్సుకు కీలకంగా పనిచేస్తుంది.
శరత్ పూర్ణిమ నాడు ఏర్పడే చంద్రగ్రహణం ధనుస్సు రాశి వారికి మెరుగైన ప్రయోజనాలను కలిగిస్తుంది. మీ సహజ ఆకర్షణ ఉత్ప్రేరకం వలే పని చేస్తుంది. కుంభ రాశి వారికి శరత్ పూర్ణిమలో ఏర్పడే చంద్రగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది.దీనివల్ల ఆర్ధిక లాభం కలుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications