Lunar eclipse2023: చంద్రగ్రహణం సమయంలో ఆహారంపై దర్భలను ఉంచటం వెనుక కారణమిదే!!
అక్టోబర్ నెలలో ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సంభవిస్తుంది. అక్టోబర్ 28 మరియు అక్టోబర్ 29 తేదీల మధ్య అర్ధరాత్రి 1.06 నిమిషాల నుండి 2 గంటల 24 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. మరికొద్ది గంటల్లో ఏర్పడనున్న ఈ చంద్రగ్రహణం భారతదేశం, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలలో కనిపించనుంది. ఈసారి ఏర్పడే చంద్ర గ్రహణం పాక్షిక చంద్ర గ్రహణంగా చెప్తారు.
ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కావడంతో సూతక కాలాన్ని పాటించాలని చెబుతున్నారు. చంద్రగ్రహణం ప్రారంభమయ్యే తొమ్మిది గంటల ముందు నుండి సూతక కాలాన్ని పాటించాలి. అయితే చంద్రగ్రహణం సమయంలో మాత్రం ప్రతి ఒక్కరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా గర్భిణీలు కూడా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

గ్రహణాలు ఏవైనా మానవ జీవితం మీద ప్రతికూలమైన ప్రభావాలను చూపిస్తాయని, గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని చెబుతున్నారు. గ్రహణ సమయంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పులతో, భూమి మీద పడే కిరణాలు శరీరం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అందుకే గ్రహణాల సమయంలో ఎవరు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు.
ఇక చాలామంది గ్రహణాల సమయంలో ఆహారంపైన దర్భలను వేయడం చూస్తాం. ఎందుకు అలా వేస్తారు అంటే గ్రహణ సమయంలో ఆహార పదార్థాల్లో గరికను వేయడం వల్ల భూమి మీదకు వచ్చే కిరణాలు, ఆహార పదార్థాలలోకి ప్రవేశించకుండా దర్భలు అడ్డుపడతాయి. ఈ సమయంలో వచ్చే కిరణాలు శరీరం పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి కాబట్టి, అవి ఆహార పదార్థాలలో చేరకుండా ఉండేలా దర్భలను వేస్తారు.
ఇక గ్రహణం విడిచే వరకు ఆహారపదార్థాలపైన గరికను వేసి, గ్రహణం విడిచిన తర్వాత ఆ గరికను తీసివేసి, ఇంటిని శుద్ధి చేసుకుని ఆహార పదార్థాలను ఉపయోగిస్తారు. గ్రహణం ఏర్పడిన సమయంలో కిరణాలు పడినటువంటి ఆహార పదార్థాలు తింటే అనారోగ్యం సంభవిస్తుంది. కాబట్టి కచ్చితంగా గ్రహణ సమయంలో దర్భలను వేస్తారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications