మహాలయ అమావాస్య.. పితృ దేవతలకు ఈ పని చెయ్యకుంటే శాపగ్రస్తులవుతారు!!
మహాలయ అమావాస్య, పితృ అమావాస్య ఈరోజు. పితృ పక్షాలలో 15 రోజులపాటు పితృదేవతలు తమ సంతతిని చూసి వారిని ఆశీర్వదించి వెళ్లడానికి భూమి పైకి వస్తారు. ఇక మహాలయ అమావాస్య నాడు పితృదేవతలు తమ సంతతి ద్వారం దగ్గరనే నిలబడి వారు చేసే కర్మల కోసం ఎదురు చూస్తారు. పితృదేవతలకు ఆరోజు శ్రార్ధ కర్మ నిర్వహించకపోతే పితృదేవతలు దీవెనలు బదులుగా శపించి వెళ్లిపోతారని చెపుతారు.
ప్రతి మాసంలోనూ అమావాస్య, పితృదేవతల పుణ్య తిథిగా భావించబడినప్పటికీ మహాలయ అమావాస్యకు మాత్రం చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు సమస్త పితృదేవతల విసర్జనం జరుగుతుంది. పితృదేవతల పుణ్య తిథి వివరాలు తెలియని వారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రార్ధం పెట్టలేనివారు, మహాలయ అమావాస్య నాడు శ్రార్ధం, దానం, తర్పణం చెయ్యాలి. అలా చేసిన వారికి పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయి.

పితృ అమావాస్య రోజు ఎవరు శ్రార్ధ విముఖంగా ఉండకూడదు. శ్రార్ధ కర్మలు చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. స్కంద పురాణంలో శ్రార్ధం చేయడం వల్ల పితృ దేవతల ఆశీర్వాదం వల్ల సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుందని చెబుతారు. పితృదేవతలను శ్రార్ధ కర్మలతో సంతోషపెడితే వారి తమ సంతతికి ఆయుష్షును, విద్యను, ధనాన్ని, సంతానాన్ని, సమస్తాన్ని కలిగి ఉండేలా ఆశీర్వదిస్తారని చెబుతారు.
ఇక శ్రార్ధ కర్మలో నువ్వులతో మిశ్రిత అన్నం సమర్పిస్తే దానం అక్షయమవుతుందని, అన్ని దానాలలో అన్నదానం చాలా ప్రధానమైనదని చెబుతారు. మహాలయ అమావాస్య రోజు ఎవరైతే దానధర్మాలు చేస్తారో, ముఖ్యంగా అన్నదానం చేస్తారో వారికి అనంతకోటి యజ్ఞాలను చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు.
అలాగే మఖా నక్షత్రం పితృదేవతలకు సంబంధించింది కనుక ఆరోజు చేసే శ్రార్ధ కర్మలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని చెబుతారు. ఏది ఏమైనా, ఎంత బిజీ ఉన్న పితృ అమావాస్య నాడు పితృదేవతల కోసం కాసేపు సమయాన్ని కేటాయించి శ్రార్ధం, దానం, తర్పణం తప్పనిసరిగా చేయాలని వివిధ పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications