ఫిబ్రవరిలో వీరికే మహరాజయోగం.. మా మాటే శాసనమన్న శని సూర్యులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. క్రమశిక్షణకు మారుపేరైన, కర్మదేవుడు అయిన శని దేవుడు అన్ని రాశుల వారి పైన తన ప్రభావాన్ని చూపిస్తాడు. శనీశ్వరుడు 2025 సంవత్సరంలో సూర్యుడుతో కలిసి చేసే ప్రయాణం కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తుంది. 2025 ఫిబ్రవరి నెలలో శని సూర్యుల సంయోగం కారణంగా కొన్ని రాశులవారికి లబ్ది జరుగుతుంది.
శని సూర్యుల సంయోగం
సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత శనితో సంయోగం చెందుతున్నాడు. కుంభరాశిలో అప్పటికే ఉన్న శని తో కలిసి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాడు. 2025 ఫిబ్రవరి మాసం నుంచి శని సూర్యుల కారణంగా కలిసి వచ్చే ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
శని సూర్యుల సంయోగం కారణంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరిలో మేషరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా లాభాలు వస్తాయి. మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మేషరాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ సమయంలో మెరుగైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి ఇదే మంచి సమయం.
సింహరాశి
శని సూర్యుల సంయోగం కారణంగా సింహ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు అవుతాయి. ఇది సింహరాశి జాతకులకు అదృష్ట సమయం. ఫిబ్రవరి మాసం నుంచి వీరికి తిరుగు ఉండదు. వీరి వ్యక్తిగత జీవితం బాగుంటుంది.
ధనస్సు రాశి
2025 సంవత్సరంలో శని సూర్యుల సంయోగం ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. డబ్బుకు లోటు లేకుండా సుఖంగా జీవితం గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ధనుస్సురాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన విజయం వరిస్తుంది. . పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు జరుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications