సెప్టెంబర్ లో మూడు గ్రహాలు కలిసిన అద్భుతయోగంతో వీరికి మహారాజయోగం.. మీరున్నారా!
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి, ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం లోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తున్న క్రమంలో వేరే గ్రహాలతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. అలా ఏర్పరిచిన యోగాలు కొన్ని శుభ యోగాలు కాగా, మరికొన్ని అశుభ యోగాలు.
సింహరాశిలో త్రిగ్రాహి రాజయోగం
సెప్టెంబర్ నెలలో సూర్యుడు, శుక్రుడు, కేతువు మూడు గ్రహాలు ఒకే రాశిలో సంయోగం జరుపుతాయి. సింహరాశిలో ఈ మూడు గ్రహాల సంయోగం కారణంగా త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. ఈ త్రిగ్రాహి రాజయోగం కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలను, సంపదలను తెచ్చిపెడుతుంది. మరి ఈ శక్తివంతమైన రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
వృశ్చికరాశి జాతకులకు త్రిగ్రాహిరాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. దీని కారణంగా వృశ్చికరాశి జాతకులు మంచి ఫలితాలను పొందుతారు. రెండు, మూడు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన ఈ సమయంలో లాభం వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారంలో కొత్త భాగస్వాములతో అద్భుతమైన పని చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు అనుకున్న స్థానానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి త్రిగ్రాహి రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు గౌరవంతో పాటు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే విద్యార్థులు చదువులో విజయాలు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలు రాసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి వారి ప్రేమ జీవితం శృంగార భరితంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషకర సమయాన్ని గడుపుతారు. ఏవైనా సమస్యలు ఉంటే ఈ సమయంలో పరిష్కారం అవుతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి త్రిగ్రాహి రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ యోగం తో వీరికి శుభ సమయం ప్రారంభమవుతుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో వీరికి కలిసి వస్తుంది. చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. చేసే పనులలో విజయం వరిస్తుంది. ఈ సమయంలో అద్భుతమైన ఆదాయాన్ని పొందుతారు. డబ్బు ఆదా చేయడంలో ఈ సమయంలో సక్సెస్ అవుతారు
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications