వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పితృ ఋణాలు తీర్చుకునే మహాలయ పక్షం ప్రారంభం

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది..?

స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్
జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్ - గరుడ పురాణం

ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు.
"ప్రేత రూపం విడిపించని కులాన్ని ( కులం = వంశం ) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భశత్రువులుగా మారి పీడిస్తారు. ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.

ప్రస్తుతం మహాలయ పక్షం 10 సెప్టెంబర్ 2022 శనివారం నుండి ప్రారంభమై సెప్టెంబర్ 25 తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

Mahayalaya paksha 2022: know what to do in this season to attain moksha

తండ్రి జీవించి తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య సెప్టెంబర్ 25 న నైనా చేసి తీరాలి.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా కర్ణా నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేసావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేసావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేసాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేసాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

గమనిక :- 10-9-2022 నుండీ 25-9-2022 వరకు మహాలయ పక్షములు. పితృదేవతల ఆరాధన ఎంత మహిమ గలదో ! మానవులే కాదు, మనం కొలిచే దేవతలు కూడా తమ అభీష్టాల కోసం పితృ దేవతలను ఆరాధిస్తారు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు శ్రాద్ధ కర్మలు వదలడం అత్యంత విశేషం అన్ని రోజులు చేయలేని వారు కనీసం తిథి నాడు మహాలయ అమావాస్య నాడు ఆయన తర్పణం శ్రాద్ధం చేసి తీరాలి.

ఆర్దిక భావం వలన సమయాభావం వలన కుటుంబ పరిస్థితి వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేని చాలా మంది శ్రేయస్సు కోసం కొన్ని ధార్మిక సంస్థలు ఈ కార్యక్రమము చేస్తున్నది.
శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి వంశాభివృద్ది జరుగుతుంది పితృదేవతల అనుగ్రహం ఉంటేనే భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది మహాలయం చేయడం వలన సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

మహాలయ పక్షములు 15 రోజులు నది తీరం నందు మీ తరపున బ్రాహ్మణో త్తములచే పితృ పూజ, మహనారాయణ హోమం, రుద్ర హోమం మహాలయ తర్పణం, శ్రాద్ధకర్మ మీ పితృ దేవతలకి ఇప్పించడానికి మా ఆధ్వర్యంలో బ్రహ్మణోత్తములచే ఇప్పించబడును. ప్రతి నిత్యము శ్రీమద్ భాగవత పారాయణ జరుగును భాగవత పారాయణ వలన మోక్షప్రాప్తి జరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. పక్షం రోజులు తర్పణం మరియు శ్రాద్ధకర్మలు జరుగును తిధి నాడు చేయించు కోవచ్చు లేదా మహా మహాలయ అమావాస్య నాడు ఒకరోజు చేసుకోవచ్చును.

ఏదైనా వ్యాధి రూపంలో లేదా ఆకస్మిక మరణం కరోనా లేదా విష జ్వరాలు, ప్రమాదాలు ఆత్మహత్యలు మరే ఇతర మైనటువంటి అనారోగ్యమైనటువంటి కారణాలు వలన చనిపోయిన వారికి కి సెప్టెంబర్ 24 వ తారీఖు నాడు విషశాస్త్ర హతనం మహాలయం నాడు తర్పణం శ్రాద్ధం జరుగును వీరికి మోక్ష ప్రాప్తి కొరకు మహా నారాయణ హోమం మరియు రుద్ర హోమం నిర్వహించబడును, ఆసక్తి గలవారు మమ్మల్ని సంప్రదించండి .. డా. ఎం. ఎన్. ఆచార్య 9440611151.

English summary
Mahalaya amavasya to start from september 10th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X