క్యారెట్ రైస్ ఇలా చేస్తే రుచికి రుచి, ఆరోగ్యం కూడా!

పిల్లలు మరియు పెద్దలు అందరూ ఇష్టపడే సింపుల్ రెసిపీ. ఆరోగ్యకరమైన ఒక రైస్ రెసిపీ కావాలంటే క్యారెట్ రైస్ బెస్ట్ ఆప్షన్. మిగిలిన అన్నంతో 5-7 నిమిషాల్లో సులభంగా క్యారెట్ రైస్ తయారు చేసుకోవచ్చు. క్యారెట్ తో తయారయ్యే ఈ రైస్ రుచితో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. లంచ్ బాక్స్‌లో పెట్టుకోవడానికి, బిజీ ఉదయాల్లో త్వరగా చేసుకోవడానికి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది.

కావాల్సిన పదార్థాలు:

అన్నం (ముందుగా వండినది) - 3 కప్పులు
క్యారెట్ లు (తురుమినవి) - 2 పెద్దవి
ఉల్లిపాయ - 1 చిన్నది (చిన్నగా తరిగినది)
పచ్చి మిర్చి - 2
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
నిమ్మరసం - 1 టీస్పూన్ (ఆప్షనల్)

Healthy and delicious Carrot Rice recipe perfect for lunch box know carrot recipe making process

తయారీ విధానం:

ఒక పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించండి. తర్వాత తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి వేయించండి. ఇందులో తురుమిన క్యారెట్ వేసి 2-3 నిమిషాలు మధ్య మధ్య కలుపుతూ వేయించండి. క్యారెట్ మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలపండి. ముందుగా వండి పెట్టుకున్న అన్నం వేసి లైట్‌గా కలపండి.

ఈ కాంబినేషన్ తో సూపర్ టేస్టీగా క్యారెట్ రైస్

చివరగా నిమ్మరసం, తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి మరో 1-2 నిమిషాలు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ క్యారెట్ రైస్ వేడిగా లేదా చల్లగా కూడా రుచిగా ఉంటుంది. పక్కన పెరుగు పచ్చడి లేదా పాపడ్‌తో సర్వ్ చేస్తే సూపర్ కాంబినేషన్ అవుతుంది. దీనిని పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇందులో క్యారెట్ వల్ల విటమిన్ A సమృద్ధిగా దొరుకుతుంది.

అన్నం ఇలా ఉండకుండా చూసుకోండి

దీంతో ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రుచి కూడా అదిరిపోతుంది. అన్నం చాలా వేడిగా ఉంటే రైస్ మెత్తగా అవుతుంది. కనుక అన్నం బాగా వేడిగా, మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. ఈ సులభమైన క్యారెట్ రైస్ ఒక్కసారి చేసి చూడండి. దీని రుచి మీకు చాలా నచ్చుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+