జాతకంలో మాల యోగం.. ఇది ఉంటే మీకు మహారాజయోగం ఖాయం!
జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న యోగాలలో మాల యోగానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. మాల యోగంలో శుభగ్రహాలు అన్ని కలిసి లగ్నం చుట్టూ ఒక శక్తివంతమైన వలయాన్ని ఏర్పరుస్తాయి. పూల హారంలా ఏర్పరిచే ఈ గ్రహాల వలయాన్ని మాల యోగం అంటారు. ముఖ్యంగా ఈ యోగంలో గురుడు, శుక్రుడు, బుధుడు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు.
మాలయోగం ఏర్పడుతుంది ఇలా
రాహు కేతువులను మినహాయించి మిగతా ఏడు గ్రహాలు వరుసగా ఏడు శుభ గృహాలలో అమరి ఉండి గ్రహాల హారాన్ని ఏర్పరిస్తే అదే మాలయోగం అవుతుంది. మాల యోగం ఉన్నవారికి గౌరవం, తెలివితేటలు, కీర్తి ప్రతిష్టలు, సంపదలు, ధర్మం పట్ల భక్తి ఉంటాయి. మాల యోగం ఉన్నవారు అంతర్గతంగా స్వచ్ఛంగా ఉంటారు. ఇది కేవలం భౌతిక లాభాలను చేకూర్చడం మాత్రమే కాకుండా మంచి సమతుల్యమైన జీవితాన్ని, ఆధ్యాత్మిక ప్రగతిని కూడా అందిస్తుంది.

మాలయోగం జాతకంలో మంచి స్థానంలో ఉంటే మీరు ధనవంతులే
మాల యోగంతో జన్మించిన వ్యక్తి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. వారికి ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు. మీరు ప్రత్యేకమైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి నుండి సంతోషాన్ని పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులను పొందుతారు. మాల యోగం జాతకంలో ఉంటే ఆ జాతకులు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మాల యోగం ఉన్నవారికి ధనవంతులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది.
మాలయోగంతో వీరికి ఈ విలాసాలు
మీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో శాశ్వతమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. స్టైల్ గా బట్టలు వేసుకోవడం, రుచికరమైన ఆహారాన్ని తినడం, సంతోషకరమైన కార్యకలాపాలను సాగించడంతో ఆనందంగా జీవిస్తారు. వీరికి మంచి వ్యక్తులతో ఏర్పడే సంబంధాల వల్ల భావోద్వేగ సంతృప్తి కలుగుతుంది. మాల యోగం ఉన్న వారి జీవితాలు విలాసం గాను సుఖవంతంగా ను ఉంటాయి మీరు సామాజిక సేవలు చేయడం పైన, ధార్మిక విషయాల పైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తారు.
మాలయోగం ప్రతికూల ప్రభావాలు ఇవే
మాల యోగం కొన్ని ప్రతికూల ప్రభావాలను కూడా ఇస్తుంది. కొన్ని సందర్భాలలో వివిధ రంగాలలో సవాళ్లను, అడ్డంకులను సూచిస్తుంది. కొంతమంది జీవితంలో ఇది వ్యక్తిత్వం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. భవిష్యత్తు ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించే, ఆందోళన చెందే ధోరణికి కూడా దారితీస్తుంది. మాల యోగం యొక్క సంభావ్య ప్రభావాలలో ఆరోగ్య సమస్యలు కూడా ఒకటి. ముఖ్యంగా శని లేదా కుజుడు వంటి ప్రభావంతో మాల యోగం శారీరక మానసిక ఆరోగ్య సమస్యలను తెలుస్తుంది. కొంతమంది జీవితాలలో ఇది ఆర్థిక అస్థిరతకు కారణమవుతుంది.












Click it and Unblock the Notifications