దీపావళికి ముందు మాలవ్య రాజయోగం: ఈ రాశులవారు తాకిన ప్రతిదీ బంగారం!

జ్యోతిష్య శాస్త్రంలో ధనం, ఐశ్వర్యం, సంతోషం మరియు సౌభాగ్యాలకు కారకుడైన శుక్రగ్రహం త్వరలో తన రాశిని మార్చబోతోంది. వచ్చే అక్టోబర్ 20, 2026 వ తేదీన శుక్ర భగవానుడు తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల అత్యంత శక్తివంతమైన పంచమహాపురుష రాజయోగాలలో ఒకటైన 'మాలవ్య రాజయోగం' ఏర్పడనుంది.

మాలవ్య రాజయోగం

సాధారణంగా శుక్రుడు తన స్వక్షేత్రంలో లేదా ఉచ్ఛ స్థానంలో సంచరించినప్పుడు ఈ అరుదైన యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగ ప్రభావం వల్ల దీపావళి పండుగకు ముందే కొన్ని ప్రత్యేక రాశుల వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోవడంతో పాటు ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఆరు ప్రధాన రాశుల వారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది.

Malavya Rajyoga Shukra Gochar on October 20 Brings Tremendous Profit to 6 Zodiac Signs with malavya rajyoga

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలను తెస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలతో పాటు పదోన్నతి లభించే బలమైన సూచనలున్నవి. మీ మాటతీరు ఇతరులను ఆకట్టుకుంటుంది మరియు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

సింహ రాశి: సింహ రాశిసింహ రాశి వారికి మాలవ్య రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. వ్యాపార రంగంలో తిరుగులేని పురోగతి కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ విజయవంతంగా ప్రారంభించడానికి, కొత్త ప్రాజెక్ట్‌లను ఇది అనుకూలమైన సమయం. వ్యాపారాన్ని విస్తరించాలనే మీ కల నెరవేరే అవకాశం ఉంది.

కన్యా రాశి: కన్యా రాశి జాతకులకు ఈ కాలంలో ఆర్థికంగా మంచి వృద్ధి కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో పాటు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

తులారాశి: స్వయంగా శుక్రుడు సంచరించబోయే తుల రాశి వారికైతే ఈ సమయం ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. జీవితంలో ముందుకు సాగడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలోనూ సంతోషకరమైన మార్పులు చోటుచేసుకుంటాయి.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగం ఉంది. పాత పరిచయాలు లేదా కొత్త ఒప్పందాల ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోయి మంచి లాభాలు ఆర్జిస్తారు. అయితే రుణాల విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు మంచిది కాదు.

డిసెంబర్ లో విశాఖ నక్షత్రంలో శుక్రసంచారం.. ఈ ఐదు రాశుల పంట పండుతుంది!
డిసెంబర్ లో విశాఖ నక్షత్రంలో శుక్రసంచారం.. ఈ ఐదు రాశుల పంట పండుతుంది!

కుంభ రాశి: కుంభరాశి జాతకులకు మాలవ్య రాజయోగం ధన స్థానంలో ఏర్పడుతున్నందున ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. పొదుపు చేసే మార్గాలు మీకు తెలుస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మీ ప్రతిభతో శత్రువులపై సులభంగా విజయం సాధిస్తారు. మొత్తంగా ఈ అరుదైన యోగం ఈ ఆరు రాశుల వారికి సువర్ణావకాశాలను అందించనుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+