ఏప్రిల్ లో మంగళ పుష్య యోగంతో పులిపంజా చీల్చి కుబేరులయ్యే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంచారం సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గ్రహాలలో అంగారక గ్రహం ఒక ముఖ్యమైన గ్రహం. అంగారకుడు ప్రస్తుతం పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. అయితే ఏప్రిల్ 12వ తేదీ 2025న ఉదయం ఆరు గంటల 32 నిమిషాలకు అంగారకుడు తనకు అనుకూలమైన పుష్య నక్షత్రం లోకి వెళ్లి అరుదైన శక్తివంతమైన మంగళ పుష్య యోగాన్ని ఏర్పరుస్తున్నాడు.
మంగళ పుష్య యోగం
ఈ మంగళ పుష్య యోగం కొన్ని రాశుల వారికి శుభాలను, శ్రేయస్సును ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. మంగళ పుష్య యోగం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. వీరు ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
ఏప్రిల్ 12వ తేదీన సంభవించే మంగళ పుష్య యోగం కారణంగా వృషభ రాశి జాతకులు ప్రయోజనాలను పొందుతారు. వృషభ రాశి వారి వృత్తి, ఆర్థిక విషయాలలో విజయాలు సాధిస్తారు. వర్తక, వ్యాపారాలు చేసేవారు అధిక ఆదాయాన్ని, వృద్దిని సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఈ సమయంలో మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఇది మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మంగళ పుష్య యోగం కారణంగా ప్రయోజనాలు చేకూరుతాయి. కర్కాటక రాశిలో లగ్న గ్రహంలో కుజుడు ఉండడంతో ఈ సమయంలో కర్కాటక రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై లాభాలు వస్తాయి. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. మంగళ పుష్య యోగం శ్రేయస్సును విజయాన్ని ప్రోత్సహిస్తుంది.
కన్యారాశి
మంగళ పుష్య యోగం కారణంగా కన్యారాశిలో జన్మించిన వారికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. కన్యా రాశి వారు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వీరి అభివృద్ధికి, విజయానికి ఇది దోహదం చేస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇది కన్య రాశి వారికి అదృష్ట సమయం. ఇప్పుడు ఏ పని చేసినా విజయం వరిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications