పదిరోజుల్లో మంగళాదిత్య యోగం.. ఈ రాశులవారికి సంపదల యోగం!
వేద జ్యోతిషశాస్త్రంలో డిసెంబర్ మాసంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. డిసెంబర్ మాసంలో గ్రహాలకు అధిపతి అయిన కుజుడు, గ్రహాల రాజు అయిన సూర్యుడు సంయోగం చెందటం వల్ల మంగళ ఆదిత్య యోగం ఏర్పడుతుంది.
మంగళాదిత్య యోగం
డిసెంబర్ మాసంలో కుజుడు డిసెంబర్ 7వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు 16వ తేదీన ధనుస్సు రాశిలోకి చేరుతాడు. రెండు గ్రహాలు ఒకే రాశిలోకి చేరడం వల్ల ధనుస్సు రాశిలో మంగళ ఆదిత్య యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

ధనస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు మంగళ ఆదిత్య యోగం శుభ యోగంగా చెప్పవచ్చు. లగ్న అధిపతి మరియు ఐదవ అధిపతి కలయిక ధనుస్సు రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆర్థిక రంగంలో మెరుగుదల ఉంటుంది. ఎప్పటినుంచో రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి.
తులారాశి
తులా రాశిలో మూడవ ఇంట్లో కుజ,సూర్య సంయోగం తులా రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగులకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. కెరీర్లో మార్పులు సంభవిస్తాయి. ఆస్తులు, వాహనాలు, గృహాలకు సంబంధించి దీర్ఘకాలంగా నిలిచిపోయిన ప్రణాళికలు పూర్తవుతాయి.
మిధున రాశి
మిధున రాశి వారికి కుజ, సూర్యుల కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కలయిక మిధున రాశిలో ఏడవ ఇంట్లో జరుగుతుంది. మిధున రాశి వారు ఈ సమయంలో కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మిధున రాశి వారికి పురోగతికి అవకాశం ఉంది. రాహువు సొంత నక్షత్రమైన శతభిషాలో ఉండడం వల్ల దాని శక్తి పెరుగుతుంది. ఇది మీ పురోగతిని వేగవంతం చేస్తుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications