కలలో మామిడిపండు.. ఫలితం తెలిస్తే ఎగిరి గంతేస్తారు!!
స్వప్న శాస్త్రం ప్రకారం కలలు మన జీవితంలోని భవిష్యత్తు పరిణామాలను తెలియజేస్తాయని చెబుతారు. కలల ద్వారా వ్యక్తి రానున్న రోజుల్లో జరగనున్న సంఘటనల గురించి అంచనా వేసుకోవచ్చు. ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. కలలో మనకు కనిపించే వస్తువులు వివిధ సంఘటనలు మన జీవితంలో భవిష్యత్తులో జరగనున్న పరిణామాలను తెలియజేస్తాయి. ఇక ఇదేక్రమంలో కలలో మామిడి చెట్టుకాని, మామిడిపండు కానీ కనిపిస్తే ఏం జరుగుతుందనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కలలో మామిడి పండు .. ఫలితం ఇలా
కలలో మామిడి పండ్లను చూసినట్లయితే జీవితంలో భవిష్యత్తులో అదృష్టం రాబోతుందని చెప్పొచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో పండిన మామిడి పండ్లను తినడం చూస్తే మీకు అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉందని అర్థం. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేస్తుందని చెబుతారు. కలలో మామిడిపండు కనిపిస్తే మీరు జీవితంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దాని నుండి కోలుకొని మంచి ఫలితాలు పొందుతారని చెబుతారు.

కలలో పచ్చి మామిడి .. జరిగేదిదే
మామిడి జీవితంలో పురోగతిని సూచిస్తుందని, స్వప్న శాస్త్రం ప్రకారం కలలో మామిడి కనిపిస్తే మంచిదని చెబుతున్నారు. కలలో పచ్చి మామిడికాయ కనిపిస్తే, పచ్చి మామిడికాయను తిన్నట్టుగా కల గంటే అదృష్టం మారబోతుందని అర్థం .ఈ సమయంలో మీకు డబ్బు చేతికి వస్తుందని, భవిష్యత్తులో కూడా చాలా విజయాలు అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక కలలో ఎవరైనా మామిడికాయను కోస్తున్నట్టుగా చూస్తే అది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మామిడి పండ్లు రాలినట్టు కలొస్తే..
మీ జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారని చెప్పడానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది. మామిడి పండ్లు రాలినట్టు కలలో కనిపించిన విద్యార్థులు ఏవైనా పరీక్షలు రాస్తే విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కలలో మామిడి చెట్టును చూసినట్లయితే ఈ కల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కల మన జీవితం పైన సానుకూల ఫలితాన్ని ఇస్తుంది.
మామిడి ఎలా కలలో కనిపించినా జరిగేదిదే
మీరు చేసే ప్రతి పనికి ప్రతిఫలం దక్కుతుందని ఇది సూచన. మామిడి ఏ రకంగా కలలో కనిపించినా మంచిదేనని మామిడి శుభాలను సూచిస్తుందని చెబుతున్నారు పండితులు. కాబట్టి కలలో మామిడికి సంబంధించి ఏది వచ్చినా మీరు భవిష్యత్తులో నక్కతోక తొక్కబోతున్నారు అని సంకేతం అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications