మార్గశిర మాసమంతా వీరింట్లో తిష్ట వేసే కుబేరుడు!
కార్తీక మాసం ముగిసి డిసెంబర్ రెండవ తేదీ నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి, పరమ శివునికి అత్యంత ఇష్టమైన మాసాలలో మార్గశిర మాసం కూడా ఒకటి. ఈ మార్గశిర మాసంలోనే లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి శ్రీమహావిష్ణువుని పూజించిందని చెబుతారు. ఇక ధనుర్మాస వ్రతం కూడా మార్గశిర మాసంలోనే నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మార్గశిర మాసంలో గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
వృషభ రాశి
మార్గశిర మాసం వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి దయతో వృషభ రాశి జాతకులు ఈ సమయంలో సంపన్నులుగా మారుతారు. నూతన వాహనాలు, నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే మాసం.

కర్కాటక రాశి
మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో భారీ లాభాలను పొందుతారు. బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల నుండి ఆస్తులు కలిసి వస్తాయి. గృహ యోగాలు వాహనయోగాలు ఉన్నాయి.
కన్య రాశి
మార్గశిర మాసం కన్యా రాశి వారిని సంపన్నులను చేస్తుంది. కన్యా రాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. విదేశాలలో వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
మార్గశిర మాసం వృశ్చిక రాశి వారిని అదృష్టవంతులను చేస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెట్టిన పెట్టుబడులు భారీ లాభాలను ఇస్తాయి. లక్ష్మీదేవి కృపతో వృశ్చిక రాశి వారు అదృష్టవంతులు అవుతున్నారు. ఏ పని తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి మార్గశిర మాసం బోలెడు ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి లాటరీలు తగిలి ఛాన్స్ ఉంది. ఊహించని విధంగా ధన యోగం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications