కన్యా రాశిలో కుజుడు దహనం: ఈ రాశులవారికి కష్ట కాలం; జాగ్రత్త!!
సెప్టెంబర్ 24వ తేదీన కన్యారాశిలో కుజుడు దహనం అవుతాడు. కన్య రాశిలో కుజుడు దహనం కావడం నాలుగు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. కన్య రాశిలో కుజుడు దహనం వల్ల మేషరాశి వారు వారి వృత్తులలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కన్య రాశిలో కుజుడు దహనం అవుతున్న సమయంలో వృత్తులకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకున్న, వ్యవహారాలు చేసిన జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.
కన్యా రాశిలో కుజుడు దహనం వల్ల మేష రాశి వారు ఎంత కష్ట పడినప్పటికీ అందుకు తగిన ప్రతిఫలం రాదు. అధికారుల నుండి కష్టానికి తగిన గుర్తింపు రాకపోగా, ఉద్యోగ జీవితం సంతృప్తిగా లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.

కన్య రాశిలో కుజుడు దహనం వల్ల వృషభరాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. వృషభ రాశి వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి విపరీతంగా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. వారి తెలివితేటలను ఉపయోగించి ఎంత కష్టపడినా సరైన ఫలితం రాకపోవచ్చు. ఉద్యోగంపై ఆసక్తిని కోల్పోయి, ఉద్యోగం మారడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి. వ్యాపారం నిరాశజనకంగా ఉండవచ్చు. కొన్నిసార్లు నష్టాలు కూడా ఎదురు కావచ్చు. వ్యాపార భాగస్వాముల నుండి సమస్యలను కూడా ఎదుర్కొనవలసి రావచ్చు.
కన్య రాశిలో కుజుడు దహనం కర్కాటక రాశి వారికి కష్టాలను కలిగిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోతారు. ఉన్నతాధికారుల మద్దతు లభించకుండా పోతుంది. పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయి. వ్యాపారం లోను మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. పోటీదారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపార ఒప్పందాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది.
కన్య రాశిలో కుజుడి దహనం వల్ల సింహ రాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలు రావు. ఊహించని ఉద్యోగ బదిలీలు ఇబ్బంది పెడతాయి. పనిలో సహ ఉద్యోగులతో విభేదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఉద్యోగాలు చేసే వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
కన్యా రాశిలో కుజుడు దహనం వల్ల ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాలను పొందుతారు. కన్యారాశిలో కుజుడు దహనం ధనస్సు రాశి వ్యాపార వర్గాలకు సవాల్ గా ఉంటుందని చెప్పొచ్చు. వ్యాపార వర్గాలు నష్టాలను చూసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వాముల తోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications