రాసిపెట్టుకోండి .. త్వరలో కుజుడి ప్రత్యక్ష సంచారంతో వీరే కోటీశ్వరులు!
వేద జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలకు తమదైన ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి గ్రహం దేనికదే ప్రత్యేకం. జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి కూడా సముచిత స్థానం ఉంటుంది. కుజుడు 45 రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. కుజుడి రాశి మార్పు ద్వాదశ రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపుతుంది. జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి.
కుజుడి ప్రత్యక్ష సంచారం
కుజుడు ధైర్య సాహసాలకు, పట్టుదలకు ప్రతీకగా చెబుతారు. ఇక అటువంటి కుజుడు ఫిబ్రవరి 24వ తేదీన మిధున రాశిలో ప్రత్యక్ష సంచారాన్ని మొదలు పెడుతున్నాడు. కుజుడు ప్రత్యక్ష సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
కుజగ్రహం ప్రత్యక్ష సంచారం మేష రాశి వారికి ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో భారీ లాభాలను పొందుతారు. జీవితంలో అనేక విషయాలలో పురోగతిని చూస్తారు. మేషరాశి వారికి సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు పోయి సంతోషంగా జీవిస్తారు. తోబుట్టువుల సహాయం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి సమయం.
కర్కాటక రాశి
కుజుడి ప్రత్యక్ష సంచారం కర్కాటక రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో గొప్ప పురోగతిని చూస్తారు. వీరికి నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. జీవితంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశిలో ఉన్న వారికి ఆరోగ్యంలో పురోగతి ఉంటుంది. ఆర్ధికంగా కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది.
సింహరాశి
కుజుడి ప్రత్యక్ష సంచారం వల్ల సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి మారుతుంది. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. సంతానం నుండి సంతోషకరమైన వార్తలు వింటారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి నుండి సంపూర్ణమైన మద్దతు వస్తుంది. సింహరాశి వారికి ఇది అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications