కన్యారాశిలోకి కుజుడు.. అక్టోబరు 3 వరకు వీరికి తిరుగులేదు

ఆగస్ట్ 18వ తేదీన కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్న కుజుడు అక్టోబర్ 3వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. కన్యారాశిలోని ఆరో ఇంటికి కుజుడు అధిపతి. కన్యా రాశిలో కుజ గ్రహ సంచారం అనేక రాశుల వారి జీవితాలకు ప్రయోజనాన్ని కలిగించనుంది. సంక్రమణ కాలంలో కొన్ని రాశుల వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలతోపాటు కుటుంబ ఆనందం లభిస్తాయి. అలా ఏయే రాశులకు కలిసివస్తుందనేది తెలుసుకుందాం.

మేషరాశి: ఎంత శ్రమ పడితే అంత ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కోర్టుకు సంబంధించిన కేసుల్లో గెలుపొందుతారు. అయితే ఆవేశాన్ని తగ్గించుకోవాలి. లేదంటే పరిస్థితి దిగజారిపోతుంది. మాటతీరు కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి. పనులు కావడానికి ఇదే ప్రధానమైంది.

Mars enters Virgo on August 18th and stays there till October 3rd.

మిథున రాశి: వీరికి అన్నీ సానుకూల ఫలితాలే ఉన్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. వృత్తిపరంగా కొత్త బాధ్యతలు వస్తాయి. పనిచేసేచోట పై అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అంతేకాదు.. అవసరమైన సమాయానికి చేతికి డబ్బు అందుతుంది.

కన్య రాశి: ఒకరకంగా వీరికి వరం అనుకోవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేస్తారు. కార్యాలయంలో మీ పనితీరుపై ప్రశంసలు వస్తాయి. పై అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది.

వృశ్చిక రాశి: తండ్రి నుంచి అనూహ్య రీతిలో పూర్తిస్థాయి మద్దతు పొందుతారు. బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించడంతోపాటు చేసే పని తనకు చెప్పి చేయడంవల్ల విజయం సాధించగలుగుతారు. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.

ధనుస్సు రాశి: వీరికి అన్నివైపుల నుంచి విజయాలున్నాయి. వృత్తిపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. ఊహించనిరీతిలో ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+