జనవరి 21నుండి వీరికి రాజభోగాలు, సంపదలు.. కుజుడి వాగ్దానం!
మన జీవితాన్ని, జాతకాన్ని నిర్ణయించేవి గ్రహాలు. గ్రహాలు నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జాతకాలను ప్రభావితం చేస్తున్నాయి. 2025లో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం, లేదా గ్రహాల వివిధ స్థితులు వెరసి శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి.
జనవరిలో కుజ సంచారం
అలాగే అన్ని గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే కుజుడు జనవరి 21 నుండి మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కుజుడు అనేక రాశులవారికి శుభ ఫలితాలు ఇవ్వనున్నాడు. జనవరి 21 నుండి ఏప్రిల్ 3 వరకు కుజుడు మిధున రాశిలోనే ఉండనున్నాడు. ఈ సమయంలో కుజుడి కారణంగా సంపదలను, శ్రేయస్సును కొన్ని రాశులవారు పొందుతున్నారు. ఇక లభ్ది పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

సింహరాశి
కుజ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు అన్ని విధాలా లాభం జరుగుతుంది. ఇది సింహరాశి వారికి సానుకూల ఫలితాలను ఇచ్చే సమయం. ఈ సమయంలో సింహరాశి వారి ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. సింహరాశి వారికి ఊహించని ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఇది సింహరాశి వారికి వర్తక, వ్యాపారాలలో అదృష్టాన్ని ఇచ్చే సమయం. విద్యార్థులకు మంచి ఫలితాలను ఇచ్చే సమయం.
మీనరాశి
మీనరాశి జాతకులకు జనవరి మాసంలో కుజ సంచారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీనరాశి వారి భవిష్యత్ బాగుంటుంది. మీనరాశి వారికి డబ్బు సంబంధిత సమస్యలు ఉంటే తొలగిపోతాయి. మీనరాశి వారి పనులలో మెరుగుదల కనిపిస్తుంది. దీంతో మీనరాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇది మీనరాశి వారికి కెరీర్ పరంగానూ కలిసొచ్చే సమయం.
కుంభరాశి
కుజ సంచారం కారణంగా కుంభరాశి వారికి ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఊహించని లాభాలు పొందుతారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కెరీర్ పరంగానూ వస్తున్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. ఇది అన్ని విధాలా కుంభరాశి వారికి కలిసి వచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications