మిధునరాశిలో ప్రత్యక్షంగా మారిన కుజుడు.. వీరికి కాసుల పంట మొదలైంది!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ప్రత్యక్ష సంచారం ప్రారంభమైంది. నేడు కుజుడు ఉదయం 5:17 నిమిషాలకు మిధున రాశిలోకి నేరుగా ప్రయాణించాడు. దీని కారణంగా ఆరు రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
ప్రత్యక్ష కుజుడు సంచారం కారణంగా మిధున రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఉపాధి కోసం చేసే అన్ని ప్రయత్నాలు ఫలించి ముందుకు దూసుకుపోతారు. మిధున రాశి వారి కృషికి తగిన ఫలితం వస్తుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఎప్పటినుంచో వసూలు కానీ బాకీలు వసూలు అవుతాయి. స్థిరాస్తుల సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

Mars is directly visible in gemini These zodiac signs become rich from today

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కుజుడు మిధున రాశిలో ప్రత్యక్షంగా సంచరించడం వలన శుభాలు జరుగుతాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారి ధైర్యం, శౌర్యం పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు రాసేవారికి ఇది సరైన సమయం.

కన్యారాశి
కుజుడి ప్రత్యక్ష సంచారం కారణంగా కన్యారాశి వారికి లబ్ధి చేకూరుతుంది. కన్యారాశి జాతకులు వివాహ సంబంధమైన విషయాలలో అత్తమామలతో సంబంధాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అయితే వర్తక, వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది. పరీక్షలు రాసేవారికి ఇది మంచి సమయం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మిధున రాశిలో కుజసంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారు పోటీ పరీక్షలలో విజయాలు సాధించి దూసుకు వెళతారు. పిల్లలకు సంబంధించి ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ఇది వీరికి అదృష్ట సమయం.

మకర రాశి
మిధున రాశిలో కుజుడు ప్రత్యక్ష సంచారం మకర రాశి వారికి అనేక విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. వీరు ఏదైనా పెద్ద పనిని ప్రారంభించాలనుకుంటే ఏదైనా ఒప్పందంపై సంతకం చేయాలి అనుకుంటే ఇది మంచి సమయం. విదేశీ స్నేహితులు లేదా బంధువుల సహకారం ఈ సమయంలో మకర రాశి వారికి పెరుగుతుంది.

మీనరాశి
మిధున రాశిలో కుజ ప్రత్యక్ష సంచారం మీన రాశి వారి జీవితాలకు కొత్త శక్తిని ఇస్తుంది. సమర్థవంతమైన నాయకత్వం సహాయంతో మీనరాశి జాతకులు ఇబ్బందికర పరిస్థితులను అధిగమిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ పనైనా ఈ సమయంలో పరిష్కరించబడతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+