శుక్రుడి నక్షత్రంలో కుజుడు.. వీరి ఇంటికి నడిచొచ్చే కుబేరుడు!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి గమనం, నక్షత్ర గమనం అన్ని రాశులవారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం కుజుడు రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. మరో మూడు రోజుల్లో కుజుడు బుధుడి నక్షత్ర రాశి అయిన మిధునరాశిలో సంచరిస్తాడు. అంతేకాదు ప్రస్తుతం సుమారు రెండు సంవత్సరాల తరువాత రోహిణి నక్షత్రంలో ప్రవేశించిన కుజుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తున్నాడు.
రోహిణీ నక్షత్రంలో కుజుడు
రోహిణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి కావడంతో శుక్రుడి శుభ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఈ సమయంలో వీరిలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత శుక్రుడి నక్షత్రంలో కుజసంచారం కారణంగా మేషరాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో మేషరాశి వారు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. సంపద వృద్ధి జరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు చేసుకోవడానికి ఇదే సరైన సమయం. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు.
వృషభరాశి
శుక్రుడి నక్షత్రంలో కుజసంచారం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశిలోనే కుజసంచారం జరుగుతున్న క్రమంలో ఈ రాశి జాతకులు డబుల్ ప్రయోజనాలను పొందనున్నారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది శుభ సమయం. ఆర్థికపరిస్థితి ఈ సమయంలో బలోపేతం అవుతుంది. ఆస్తులలో పెట్టే పెట్టుబడులు లాభాలను తీసుకువస్తాయి. న్యాయపరమైన సమస్యలు ఉంటే పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు.
మకర రాశి
రోహిణి నక్షత్రంలో కుజసంచారం మకర రాశి వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా లాభాలను పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పూర్వీకుల నుండి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలలో సమస్యలు తొలగిపోయి లాభాలు పొందుతారు. ఈ సమయంలో మకర రాశి వారి ధైర్య సాహసాలు పెరుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications