కుజుడి నక్షత్ర గోచారం.. ఈ రాశులవారికి అపార సంపదల వర్షం!!
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరించడం వల్ల అన్ని రాశుల వారి పైన ప్రభావం పడుతుంది. అంతేకాదు గ్రహాల నక్షత్ర సంచారం కూడా ద్వాదశ రాశుల వారి జాతకాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం అంగారకుడు భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కుజుడు భరణి నక్షత్రంలో సంచరిస్తున్న కారణంగా నాలుగు రాశుల వారి జీవితాలలో అదృష్టం ప్రకాశిస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేష రాశి
మేషరాశిలో ప్రస్తుతం కుజుడు సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కుజుడు భరణి నక్షత్రంలో కూడా సంచరిస్తున్నాడు. దీనివల్ల మేషరాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. విదేశాలలో చదువుకోవాలనుకునే వారి కల సాకారం అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

వృషభ రాశి
కుజుడి నక్షత్ర మార్పు వృషభ రాశి వారి జీవితంలో శుభ ఫలితాలకు కారణమవుతుంది. వృషభ రాశి వారి ఆదాయం ఇప్పుడు గణనీయంగా పెరుగుతుంది.నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. కెరీర్లో పురోగతికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు సంతోషంగా గడుపుతారు.. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
తులారాశి
భరణి నక్షత్రంలో కుజ గోచారం కారణంగా తులా రాశి జాతకులు లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో వీరి జీవనశైలి మెరుగుపడుతుంది. ఆర్థికంగా లాభం పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వర్తక వ్యాపారాలలో లాభం పొందుతారు. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిని పొందుతారు .
వృశ్చిక రాశి
కుజుడి నక్షత్ర మార్పు వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు విజయవకాశాలు కలుగుతాయి.. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. జీవితంలో ఎదురైన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications