జులై 28నుండి వీరికి కష్టాలు, కన్నీళ్లు తప్పవన్న కుజుడు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు వేటికదే తగిన శక్తి ఉంటుంది. కుజుడు ధైర్యానికి, శక్తికి, పోరాట పటిమకు చిహ్నంగా పరిగణించబడతాడు. జాతకంలో కుజుడు బలంగా ఉంటె ఆయా జాతకులకు కలిసి వస్తుంది. జాతకంలో కుజుడి స్థానం బలహీనంగా ఉంటే, వ్యక్తి జీవితంలో ఒత్తిడి, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టాలు వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.

జులై 28న కన్యారాశిలోకి కుజుడు
జూలై 28న కుజుడు కన్యారాశిలో ప్రవేశించడం వల్ల మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.కుజుడు కన్యారాశిలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఏ పని చేసిన జాగ్రత్తగా ఉండాలి . ఈ నేపథ్యంలో, కన్యారాశిలో కుజుడి సంచారం ఏ రాశుల వారికి సమస్యలు కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Mars says these zodiac signs will face hardships from July 28th

మిధునరాశి
మిథున రాశి వారికి కన్యారాశిలో కుజుడి ప్రవేశం వల్ల కష్టాలు వస్తాయి. కుజ సంచారం తో మిధునరాశి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం తగ్గుతుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కుటుంబ జీవితంలో మనస్పర్థలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి, తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

కుంభరాశి
కుంభ రాశి వారు కూడా కుజ సంచారం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుంభరాశి వారికి ఈ సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువుపై ఆసక్తిని కోల్పోవచ్చు. బంధుమిత్రులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది, ఇది సంబంధాలలో సమస్యలకు దారితీస్తుంది. కుంభరాశి వారికి ఇది ప్రతికూల సమయం.

మీనరాశి
మీన రాశి వారికి కుజుడు రాశి మారటం వలన అనేక ఇబ్బందులు రావొచ్చు. మీనరాశి వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ మాటలు ఇతరులను బాధించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. మీనరాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, సహనంతో వ్యవహరించాలి, పరిస్థితులకు తగినట్టు స్పందిస్తే మంచిది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+