మేషరాశిలో కుజ సంచారంతో ఈ రాశులవారికి ఆరోగ్య భంగం.. ఆర్ధిక నష్టం
కుజుడు మేషరాశిలో జూన్ ఒకటవ తేదీ నుండి సంచరిస్తున్నాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కుజుడు పాలక రాశి అయిన మేషరాశిలో కుజ సంచారం కొన్ని రాశుల వారికి ఊహించని ఫలాలను మరికొన్ని రాశుల వారికి అననుకూలమైన ప్రభావాలు కలుగుతాయి. మేష రాశిలో కుజ సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలను పొందే రాశులను గురించి తెలుసుకుందాం.
వృషభ రాశి
మేష రాశిలో కుజ సంచారం వృషభ రాశి జాతకులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో కంటి సమస్యలు, పంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనారోగ్య సమస్యలు చిన్నవి అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి పెద్దవిగా మారే ప్రమాదం ఉంది.

కన్యారాశి
మేష రాశిలో కుజ సంచారం కన్యారాశి జాతకులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కన్యారాశి జాతకులు కూడా ముఖ్యంగా కళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి కంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన వైద్య చికిత్సలు తీసుకోవాలి. సమయంలో ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటారు
తులారాశి
మేష రాశిలో కుజ సంచారం తులా రాశి జాతకులకు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తులారాశి జాతకులు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా. ఈ సమయంలో డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది.
మకర రాశి
మేష రాశిలో కుజ సంచారం కారణంగా మకర రాశి జాతకులకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో మీకు ఇమ్యూనిటీ బాగా తగ్గుతుంది. ఒత్తిడి, నీరసం, అలసట వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మకర రాశి జాతకులు కుటుంబంలో తల్లి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఆసుపత్రులకు చికిత్స కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications