మేషరాశిలో కుజ గోచారం.. జూన్ ఆరంభంలోనే ఈ రాశులవారికి ధనయోగం
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలపై ప్రభావం ఉంటుంది. జూన్ 1వ తేదీన కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలో సంచరించబోతున్నాడు. జూన్ 1వ తేదీన మధ్యాహ్నం కుజుడు 3.39నిమిషాలకు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆపై జూలై 1వతేదీ వరకు కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. ఈ పరిణామం దాదాపు 38ఏళ్ల తర్వాత జరుగుతుంది కాబట్టి మేషరాశిలో కుజసంచారం చాలా ప్రత్యేకం.
మేషరాశి
మేష రాశిలో కుజ సంచారం వల్ల మేష రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. మేషరాశి జాతకుల వృత్తికి అనుకూలమైన సమయం. వర్తక వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేసి విజయం సాధిస్తారు. ఈ సమయంలో వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితిలో కూడా మెరుగుదల ఉంటుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మేష రాశిలో కుజ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. అదే సమయంలో.. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఈ సమయం వీరికి మరింత లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు సాధించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం.
మిధున రాశి
మేష రాశిలో కుజ సంచారం మిధున రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వృత్తిపరమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పనిచేసే చోట మంచి గుర్తింపు లభిస్తుంది. కెరీర్ పురోగతికి ఇది సరైన సమయం. ఆర్థికంగానూ బాగా కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే, మీరు దానిని కూడా తిరిగి పొందవచ్చు.
సింహరాశి
మేష రాశిలో కుజ సంచారం సింహ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. సింహరాశి జాతకుల కెరీర్ బాగుంటుంది. నిలిచిపోయిన అనేక పనులు పూర్తి అవుతాయి. కార్యాలయంలో పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితోపాటు జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో విస్తరణ ఉండవచ్చు. డబ్బు సంపాదించడానికి కొత్త వనరులు కూడా సృష్టించబడతాయి.
ధనుస్సు రాశి
మేషరాశిలో కుజ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి లబ్ది జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ పరంగా చూస్తే సమయం బాగానే ఉంటుంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడవచ్చు. మీరు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు.
మకర రాశి
మకర రాశి జాతకులకు మేషరాశిలో కుజ సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. మకరరాశి వారికి వృత్తి పరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి కావలసిన ఈ సమయంలో బాగా పెరుగుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెడతారు. ఇది మీ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.
వృశ్చిక రాశి
మేషరాశిలో కుజ సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు మీకు విజయం సాధించడానికి ఎంతో దోహదం చేస్తాయి. అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఈ సమయంలో చట్టపరమైన సమస్యలు, అప్పులు మీకు ఇబ్బందులు కలిగించవు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications