డిసెంబర్ లో కుజ సంచారంతో వీరికి లాటరీ తగులుతుంది పక్కా !
వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి విశేషమైన స్థానం ఉంది. కుజుడు సూర్యుడి నుండి నాలుగవ గ్రహం. జ్యోతిష్య శాస్త్రంలో శక్తికి, ఆశయానికి, చర్యలకు సంబంధించిన గ్రహంగా చెబుతారు. కుజుడు ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాడు అటువంటి కుజుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు.
డిసెంబర్ లో ధనుస్సు రాశిలోకి కుజ సంచారం
డిసెంబర్ మాసంలో కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 7 ఆదివారం రాత్రి 7 గంటల 26 నిమిషాలకు ధనుస్సు రాశిలో కుజ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కుజ సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మేషరాశి
డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో కుజుడు సంచరించడం వల్ల మేషరాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. కుజుడి రాశి మార్పు మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. శత్రువుల బాధ నుండి మేష రాశి వారికి విముక్తి లభిస్తుంది.
మిధున రాశి
మిధున రాశి వారికి ధనుస్సు రాశిలో కుజ సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువ లాభాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కెరీర్లో మంచి మార్పులు చూస్తారు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
కుజ సంచారం వృశ్చిక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సంచారం ద్వారా మీరు ఎక్కువ లాభాలను పొందుతారు. వివాహం కాని వారికి పెళ్లిళ్లు కుదురుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఎక్కువ లాభాలు వస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి.
ధనుస్సు రాశి
కుజ సంచారం ధనుస్సు రాశి జాతకులకు మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. విజయాలను అందిస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. సక్సెస్ ను అందుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications