2025లో వీరికి కుబేరయోగం.. ఏప్రిల్ వరకు తిరుగులేని రాశులు ఇవే!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనమే అన్ని రాశుల వారి జీవితాన్ని నిర్దేశిస్తుంది. ప్రస్తుతం నీచ స్థానంలో కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న కుజుడు జనవరి 22 నుండి మిధున రాశిలోకి తిరోగమనం చేస్తాడు. ఏప్రిల్ 5వ తేదీ వరకు మిధున రాశి లోనే కొనసాగుతాడు.

మిదునరాశిలో కుజ సంచారం
పట్టుదల, ధైర్య సాహసాల వంటి లక్షణాలకు ప్రతీకగా భావించే కుజుడు సహజంగా సాహస రాశి అయిన మిధున రాశిలోకి ప్రవేశించడం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తెస్తుంది. వీరు కుజుడి మిధున రాశి సంచారం వల్ల అత్యధికంగా ప్రయోజనాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

mars transit into gemini gives these zodiac signs kuberayoga

మేషరాశి
2025 సంవత్సరంలో కుజుడు మేషరాశిలో తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల వీరికి అన్ని విధాల ప్రయోజనాలు చేకూరుతాయి. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. రుణ బాధలు తగ్గుతాయి. రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. పోటీ పరీక్షలను రాసే విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.

సింహరాశి
సింహ రాశి వారికి లాభ స్థానంలో కుజ సంచారం కారణంగా వీరికి ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలను ఇస్తాయి. రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. విదేశాలలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కుటుంబంలో శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది.

కన్యారాశి
కన్య రాశిలో దశమ స్థానంలో కుజ సంచారం కారణంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల విక్రయాలలో లాభాలు పొందుతారు.

తులారాశి
తులా రాశి వారికి భాగ్య స్థానంలో కుజగ్రహ ప్రవేశం కారణంగా ఆస్తి లాభం కలుగుతుంది. ఈ సమయంలో వీరే పని చేసిన విజయాలు చేకూరుతాయి. వారసత్వ సంపద లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు పొందుతారు.

ధనస్సు రాశి
ధనుస్సు రాశిలో సప్తమ స్థానంలో కుజ సంచారం కారణంగా అపారమైన ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి దక్కుతుంది.

మకర రాశి
మకర రాశి వారికి ఆరవ స్థానంలో కుజ సంచారం వల్ల ఆస్తి సమస్యలు, వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి మకర రాశి వారికి ఉపశమనం కలుగుతుంది. అనేక మార్గాలలో ఆదాయం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+