వృశ్చిక రాశిలో కుజ సంచారం నేడే.. ఈ రాశులవారికి పేరుప్రతిష్టలు, ఐశ్వర్యం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రవాణా అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహాలలో ముఖ్య గ్రహంగా పరిగణించే అంగారకుడి రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ధైర్యసాహసాలకు పెట్టింది పేరుగా భావించే కుజుడు శుభ స్థానంలో ఉంటే ఆ రాశి చక్ర జాతకులకు ఎంతో సానుకూలతలను ఇస్తుంది. ఒకవేళ ఆ రాశులలో కుజుడు నీచ స్థానంలో ఉంటే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నేడు కుజుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి బదిలీ అవుతున్నాడు. ఇది అన్ని రాశుల వారి జాతకాలను ప్రభావితం చేస్తుంది. ఈరోజు ఉదయం 10:03 నిమిషాలకు కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పు ముఖ్యంగా మూడు రాశుల వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. వారి గౌరవ ప్రతిష్టలు పెరగడమే కాకుండా, సంపద వృద్ధి కలుగుతుంది. ఇక ఆ మూడు రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
కుజుడు యొక్క రాశి మార్పు వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి గౌరవం పెరుగుతుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీరు పెద్దగా కష్టపడకుండానే డబ్బు వస్తుంది. పూర్వీకుల నుండి ఆస్తి పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆఫీస్ పనులన్నీ చక్కగా పూర్తి చేయగలుగుతారు. అధికారులతో మన్ననలు పొందుతారు.

మిధున రాశి
కుజుడు యొక్క రాశి మార్పు మిధున రాశి వారికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మిధున రాశి వారికి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లవలసిన రావచ్చు. ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కుజుని యొక్క రాశి మార్పు కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడిదారులతో ఈ సమయంలో వ్యాపారాలు చేయవచ్చు. కర్కాటక రాశి వారికి దాంపత్య జీవితం ఈ సమయంలో చాలా మధురంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications