2025లో 7సార్లు రాశిని మార్చి వీరికి 7తరాలకు సరిపోయే సంపదలిస్తున్న కుజుడు!
2025 సంవత్సరంలో కుజసంచారం అనేక రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. 2025 జనవరి 23 వరకు కుజుడు కర్కాటక రాశిలో తిరుగుతూ జనవరి 23వ తేదీన కుజుడు కర్కాటక రాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో కుజుడు తిరోగమనములో సంచారం చేయడం వల్ల జనవరి 23వ తేదీన కుజుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మళ్లీ మిధున రాశి నుండి ఏప్రిల్ మూడవ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
మొత్తం 7 రాశుల్లో కుజ సంచారం
ఆపై జూన్ 7వ తేదీన సింహరాశిలోకి వెళతాడు. జూన్ 7వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు సింహరాశిలో సంచారం చేసి ఆపై కన్యరాశిలోకి సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఆపై సెప్టెంబరు 13వ తేదీన తులారాశిలోకి, అక్టోబర్ 27వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశించి తిరిగి డిసెంబర్ 7వ తేదీన ధనుస్సురాశిలోకి సంచారం చేస్తాడు. మొత్తం ఏడు రాశుల్లో తిరుగుతూ కుజుడు అనేక రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తాడు.

మిధున రాశి
2025 సంవత్సరం మిధున రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుజ సంచారం ప్రభావంతో మిధున రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఇది మిధున రాశి వారికి మంచి సమయం. వ్యాపారంలో స్నేహితుల మద్దతుతో లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం మీరు కన్న కలలు నెరవేరుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కుజ సంచారం శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలో బాగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉపాధి సమస్యలు పరిష్కారం అవుతాయి. కర్కాటక రాశి వారి జీవితం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో సంతోషంగా బ్రతకడానికి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. అవివాహితులకు వివాహాలు సెటిల్ అవుతాయి. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసిన విజయాలు వరిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 2025 సంవత్సరంలో మీరు ఆరోగ్యంగా ఉంటారు. వర్తక వ్యాపారాలు విస్తరించడానికి ఇది మంచి సమయం. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను చూస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications