మార్చి నెలలో ఈ రాశుల వారిపై సంపదల వర్షం, దీవించిన దివ్య గ్రహాలు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా ప్రతి నెలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని రాశుల వారికి మార్చి నెల శుభప్రదంగా ఉండబోతుంది. ఈ సంవత్సరం మార్చి నెలలో కొన్ని రాశుల వారు ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. మార్చి నెలలో గ్రహాల మార్పు కారణంగా నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
మార్చి నెలలో లబ్ది పొందే రాశులివే
మార్చి నెలలో శుక్రుడు తిరోగమన సంచారం చేస్తాడు. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు శుక్రుడు మేషరాశిలోనూ, మీనరాశిలోనూ తిరోగమనం చేస్తాడు. శని మీన రాశిలోకి మార్చి 29వ తేదీన సంచారం చేస్తాడు. మార్చి 29వ తేదీనే బుధుడు కూడా మీన రాశిలోకి సంచారం చేస్తాడు. ఇలా ముఖ్య గ్రహాల సంచారం కారణంగా మార్చి నెలలో నాలుగు రాశుల వారికి లబ్ధి జరుగుతుంది.

మేష రాశి
మేష రాశి వారికి మార్చి నెల కొత్త అవకాశాలను ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. మేష రాశి వారి కొత్త వ్యాపారం విజయవంతం అవుతుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలతో మేష రాశి వారు సంతోషంగా జీవిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి మార్చి నెలలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారం నుండి వృషభ రాశి జాతకులు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయం వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మార్చి నెల ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చేందుకు అవకాశం ఉంది.
సింహరాశి
మార్చి నెలలో సింహరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఇది సింహ రాశి వారికి కొత్త విజయాలను సాధించేలా చేసేందుకు వీలవుతుంది. ఈ సమయంలో సింహరాశి వారి ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. ఏ పని చేసినా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.
మకర రాశి
మార్చి నెలలో మకర రాశి జాతకులకు కలిసి వస్తుంది. మకర రాశి వారు సరైన పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఏ పని చేసినా మకర రాశి వారికి ఇది సరైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications