రాసిపెట్టుకోండి... రాహువుకి ఇష్టమైన ఈ రాశులవారికి సంపదల వర్షం!

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను నీడ గ్రహాలుగా చెబుతారు. అంతే కాదు చెడు చేసే గ్రహాలుగా కూడా పరిగణిస్తారు. రాహువు, కేతువు గ్రహాలు చాలా నిదానంగా కదిలే గ్రహాలు. ఈ రెండు గ్రహాల ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన కచ్చితంగా ఉంటుంది.

రాహువుకు ఇష్టమైన రాశులు
రాహువు గ్రహానికి కొన్ని రాశులు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో తెలిపారు. రాహువు ఇష్టపడే ఆ రాశుల వారికి ఊహించని సానుకూల ఫలితాలు వస్తాయని, వారిని అదృష్టం వరిస్తుందని చెబుతారు. మరి రాహువుకి ఇష్టమైన ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

May these zodiac signs which are favored by Rahu be blessed with wealth

మిధున రాశి
రాహువుకు అత్యంత ఇష్టమైన రాశులలో మిధున రాశి ఒకటి. మిధున రాశిలో రాహువు ఉచ్చ స్థితిలో ఉండడం కారణంగా వారు రాహువు అనుగ్రహాన్ని చూస్తారు. జీవితంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి రాహువు పరిష్కారాన్ని అందిస్తాడు. కోరుకున్న కోరికలు నెరవేరడానికి దోహదం చేస్తాడు. అనారోగ్యం బారి నుండి కూడా మిధున రాశి వారిని కాపాడతాడు.

కన్య రాశి
రాహువు కి ఎంతో ఇష్టమైన రాశులలో కన్యా రాశికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. కారణంగా కన్యారాశి జాతకులు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు .కన్యా రాశి వారి జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి కన్యా రాశి జాతకులు మంచి ఫలితాలను పొందుతారు. వీరి మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కన్యారాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కుంభరాశి
రాహువు కి ఇష్టమైన రాశులలో కుంభ రాశి వారికి స్థానం ఉంది. కుంభరాశి వారి పైన రాహువు కటాక్షం నిండుగా ఉంటుంది. కుంభ రాశి వారిలో సామాజిక మార్పు కోసం పనిచేసే ఆలోచన రాహువు కటాక్షంతోనే కలుగుతుంది. తన ఆశీర్వాదంతో కుంభరాశి వారిని రాహువు బలోపేతం చేస్తాడు. కుంభరాశి జాతకులకు రాహువు కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+