త్వరలో ప్రతియుతి యోగంతో వీరింట సంపదల పంట ఖాయం చేసిన బుధుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తెలివితేటలను, వాక్చాతుర్యాన్ని, వ్యాపారాలను వృద్ధి చేసే గ్రహంగా బుధ గ్రహాన్ని భావిస్తారు. అయితే నవగ్రహాలు మాత్రమే కాకుండా మన జీవితం పైన ప్రభావాన్ని చూపించే వరుణగ్రహం, యమగ్రహం వంటి గ్రహాలు కూడా ఉన్నాయి. హిందూ విశ్వాసాల ప్రకారం యమ రాజు నివసించే గ్రహం ఫ్లూటో మరుగుజ్జు గ్రహంగా పరిగణించబడుతుంది.
ప్రతియుతి యోగం
సౌర వ్యవస్థ నుంచి తొలగించబడిన ఈ గ్రహం బుధ గ్రహానికి ముఖాముఖిగా రావడం వల్ల ప్రతి యుతి యోగం ఏర్పడుతుంది. బుధ గ్రహం తక్కువ రోజుల్లో తన రాశిని మార్చుకుంటుండగా అప్పుడప్పుడు ఇతర గ్రహాలతో కలిసి యోగాలను ఏర్పరచడం వల్ల కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. జూన్ 29వ తేదీన బుధుడు యముడు ముఖాముఖి కలుసుకొని ప్రతి యుతి యోగాన్ని ఏర్పరుస్తున్నారు.

బుధుడు, యముడు కలిసి ప్రతియుతి యోగం
బుధుడు కర్కాటక రాశిలో యముడు మకర రాశిలో ఈ యోగాన్ని ఏర్పరచడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి సంపదలు, సౌఖ్యాలు కలుగుతాయి. ఈ ప్రతి యుతి యోగం వల్ల అదృష్టవంతులయ్యే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి బుధుడు, యముడు ఏర్పరిచిన ప్రతి యుతి యోగం వల్ల ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఈ సమయం దోహదం చేస్తుంది. శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది.
కన్యారాశి
ప్రతియుతి యోగం కారణంగా కన్యారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన అదృష్టలక్ష్మి వరిస్తుంది. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కెరీర్ విషయంలో, ఆర్థిక విషయాలలో మంచి పురోగతిని తెస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. వ్యాపారులు అధిక లాభాలను అర్జించి సంతోషంగా ఉంటారు. నగదు ప్రవాహం బాగుంటుంది. ఈ సమయంలో చాలా డబ్బు ఆదా అవుతుంది.
మిధున రాశి
మిధున రాశి వారికి ప్రతియుతి యోగం అదృష్టాన్ని ఇస్తుంది. మిధున రాశి జాతకులకు ప్రతి పనిలోనూ ఇది మంచి విజయాన్ని ఇస్తుంది. పనిలో సహోద్యోగులతో సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారవేత్తల ప్రణాళికలు విజయవంతంగా మారుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో భారీ లాభాలను పొందే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications