త్వరలో బుధాదిత్య రాజయోగంతో వీరికి ధనవర్షం తధ్యమన్న బుధ సూర్యులు!
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. నవగ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు ప్రతి నెల తన స్థానాన్ని మార్చుకుంటూ సంచారం చేస్తాడు. సూర్యుడి రాశి మార్పు అన్ని రాశులవారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇదే సమయంలో బుధుడు కూడా తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తాడు. బుధుడు కూడా సాధారణంగా 24 రోజుల సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు.
బుధాదిత్య రాజయోగం
మే నెల 7వ తేదీన బుధుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్య భగవానుడు కూడా అదే సమయంలో మేషరాశిలో సంచారం చేయడం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
సూర్యుడు, బుధుడు కలిసి కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు. సూర్యుడు బుధుడు కలవడం వల్ల ఏర్పడిన బుధాదిత్య రాజయోగం ఈ రాశిలో పదవ ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
సింహరాశి
సూర్యుడు, బుధుడు కలిసి ఏర్పరిచే బుధాదిత్య రాజయోగం కారణంగా సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. సింహరాశిలో 9వ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరి వైవాహిక జీవితం సంతోష దాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి మంచి పురోగతి ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
తుల రాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా తులా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. తులా రాశిలో ఏడవ ఇంట్లో ఈ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల తులా రాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. జీవితంలో వచ్చిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగి తులారాశి జాతకులు సంతోషంగా ఉంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications