త్వరలో ఈ రాశులవారికి ఆర్ధిక నష్టాలు, కష్టాలు ఇస్తున్న బుధుడు!
గ్రహాల రాకుమారుడు బుధుడు మరో రెండు రోజుల్లో అస్తంగత్వ దశలోకి వెళ్ళనున్నాడు. ఇక ఈ పరిణామం కొన్ని రాశుల వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. ఆయా రాశులవారు ఆర్థిక నష్టాలను, కెరీర్లో ఇబ్బందులను, ఊహించని కష్టాలను చూడాల్సి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేష రాశి
అస్తంగత్వ దశలో బుధ సంచారం మేష రాశి జాతకులకు కలిసొస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పనిలో కూడా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం కూడా ఒడిదుడుకుల మయంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభరాశి
అస్తంగత్వ దశలో బుధ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు కుటుంబంలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వృత్తి వ్యాపారాలలోనూ, కెరీర్ లోనూ అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శత్రువుల చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది. కుటుంబం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.
కర్కాటక రాశి
అస్తంగత్వ దశలో బుధ సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో వృత్తిపరంగా వీరికి నష్టాలు వస్తాయి. కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆదాయం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం మిమ్మల్ని మరింత నష్టాలలోకి నడుస్తుంది.
కన్య రాశి
అస్తంగత్వ దశలో బుధ సంచారం కారణంగా కన్య రాశి జాతకులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. దీని వల్ల డబ్బు నష్టపోతారు. కెరీర్ పరంగాను ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాలు చేసే వారికి లాభాలు రావు. సంపదను పెంచుకునే అవకాశాలు తగ్గుతాయి. ఊహించని ఖర్చులు పెరుగుతాయి.
తులారాశి
అస్తంగత్వ దశలో బుధ సంచారం కారణంగా తులా రాశి జాతకులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కెరీర్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జీవితంలో అసంతృప్తి కనిపిస్తుంది. రోజువారి వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత కష్టపడినప్పటికీ తగిన ఫలితాలు రావు.
మకర రాశి
అస్తంగత్వ దశలో బుధ సంచారం కారణంగా మకర రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కెరీర్ కు సంబంధించి మకర రాశి జాతకులు అసంతృప్తితో ఉంటారు. ఒత్తిడి కారణంగా ఇబ్బందులు పడతారు. వ్యాపారాలను విస్తరించాలి అనుకునే వారికి ఇది సరైన సమయం కాదు. ఆర్థిక పురోగతి చాలా కష్టంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications