దహనమవుతూ వీరి జీవితాల్లో సంపదల ప్రకాశం ఇస్తున్న బుధుడు
జ్యోతిష్య ప్రపంచంలో గ్రహాల కదలికలు ఒక సాధారణ ప్రక్రియ అయినప్పటికీ ఇవి అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. . 24 జూలై 2025న, బుధుడు కర్కాటక రాశిలో రాత్రి 07:42 గంటలకు అస్తమిస్తాడు. బుధుడు ఆగస్టు 09, 2025 వరకు అదే స్థితిలో బుధుడు దహనం అవుతూనే ఉంటాడు. బుధగ్రహ దహనం శుభప్రదంగా పరిగణించబడనప్పటికీ, ఈ సమయంలో కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశిలో బుధ దహనం
జ్యోతిష్య శాస్త్రంలో, బుధుడిని మేధస్సు, కమ్యూనికేషన్, హాస్యం, ప్రసంగం, అనుకూలత మరియు అభ్యాస సామర్థ్యం యొక్క గ్రహంగా పరిగణిస్తారు. బుధుడి యొక్క ఈ పరివర్తన కొన్ని రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలను అందిస్తుంది. బుధుడు కర్కాటకరాశిలో దహనం అవుతూ ఏ రాశులవారికి అదృష్టాన్ని ఇస్తున్నాడో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభం
వృషభ రాశికి బుధుడు రెండవ మరియు ఐదవ ఇంటికి అధిపతి. బుధుడు మూడవ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు అస్తమిస్తాడు. ఈ కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ప్రతికూల ప్రభావాలు తగ్గి ఈ సమయంలో కొంత మార్పును చూడవచ్చు. మీ తోబుట్టువులతో ఉన్న వివాదాలు శాంతించవచ్చు. మీ పొరుగువారితో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి . నష్టాలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది.
కర్కాటకం
కర్కాటక రాశికి బుధుడు మూడవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి. ఈ సమయంలో బుధుడు మీ మొదటి ఇంట్లో సంచరిస్తాడు. బుధుడు వలన కలిగే ఇబ్బందులు ఇప్పుడు తగ్గుతాయి. డబ్బు సంబంధిత విషయాల్లో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. దీనివల్ల నష్టాలు తగ్గుతాయి. మీ బంధువులతో కొనసాగుతున్న వివాదాలు ఇప్పుడు పరిష్కరించబడతాయి. మీకు మంచి కోరుకునేవారు ఎవరు అనేది ఇప్పుడు మీరు గుర్తించగలరు.
సింహం
సింహ రాశికి బుధుడు రెండవ మరియు లాభ స్థానానికి అధిపతి. ఇప్పుడు, బుధుడు మీ పన్నెండవ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు దహనం అవుతాడు. ఇది సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఖర్చులపై మీకు నియంత్రణ ఉంటుంది. దీనివల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రణాళికలన్నీ గొప్ప ఫలితాలను ఇస్తాయి. సమస్యల నుంచి బయటపడగలరు.
వృశ్చికం
వృశ్చిక రాశికి బుధుడు ఎనిమిదవ మరియు లాభ స్థానానికి అధిపతి. ఇప్పుడు బుధుడు మీ అదృష్ట స్థానంలో సంచరిస్తున్నప్పుడు దహనం అవుతాడు. వృశ్చిక రాశి వారి జీవితాల్లో ప్రతికూల ప్రభావాలు దీనివలన ప్రతికూలతలు తగ్గుతాయి. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు .సమాజంలో మంచిపేరు సంపాదించగలుగుతారు. వైవాహిక జీవితంలో శాంతి,సంతోషం ఉంటాయి. ఈ సమయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడుపుతారు.
ధనుస్సు
ధనుస్సు రాశికి బుధుడు ఏడవ మరియు పదవ ఇంటికి అధిపతి. ఇది మీ ఎనిమిదవ ఇంట్లో దహనం అవుతుంది. ఎనిమిదవ ఇంట్లో బుధుడి సంచారం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కష్టపడి పనిచేయడం ద్వారా మీరు కార్యాలయంలో విజయం సాధిస్తారు. మీరు మీ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. పెట్టుబడుల కోసం సరైన నిర్ణయం తీసుకోవడం చేస్తారు. ఆకస్మిక ధన లాభాలను పొందే అవకాశం ఉంది.
మకరం
మకర రాశికి బుధుడు ఆరవ మరియు అదృష్ట స్థానానికి అధిపతి. ఇప్పుడు బుధుడు మీ ఏడవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ కారణంగా ప్రతికూలతలు తగ్గుతాయి. ప్రభుత్వ మరియు పరిపాలనకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఈ రాశి వారు బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం వలన వృత్తి జీవితంలో అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. బుధుడి సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంటే, ఇప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications