మీనరాశిలో బుధ దహనం.. ఈ రాశులవారి సంపదలు నాశనం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి అనే విషయం మనకు తెలిసిందే. ఇక గ్రహాల రాకుమారుడుగా చెప్పుకునే బుధుడు మార్చి నెలలో దహనం కాబోతున్నాడు. మార్చి 17వ తేదీన మీనరాశిలో బుధ దహనం జరుగుతుంది. మీనరాశిలో బుధుడు దహనం కారణంగా కొన్ని రాశుల వారికి కష్టాలు రాబోతున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశిలోని మూడవ మరియు ఆరవ గృహాలకు అధిపతి అయిన బుధుడు 12వ ఇంట్లో దహనం అవుతున్నాడు. మీనరాశిలో బుధుడు దహనం మేష రాశి జాతకులకు ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో మేషరాశి జాతకులు సమస్యలు ఎదుర్కొంటారని, ఉద్యోగం చేసేవారు ఒత్తిడిని ఎదుర్కొంటారని చెబుతున్నారు. ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. మేష రాశి వారికి ఈ సమయం కష్టంగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మీనరాశిలో బుధ దహనం కారణంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. బుధుడు కర్కాటక రాశిలో మూడవ, 12వ ఇంటిని పాలిస్తాడు. బుధుడు తొమ్మిదవ ఇంట్లో దహనం కాబోతున్నాడు. దీని ఫలితంగా కర్కాటక రాశి జాతకులు తమ వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనిచేసే వారికి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆందోళన మరియు నిరాశకు లోనవుతారు. పని భారం విపరీతంగా పెరుగుతుంది.
సింహరాశి
సింహ రాశి వారికి బుధ దహనం కారణంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. సింహరాశిలో రెండవ మరియు పదకొండవ గృహాలకు అధిపతి అయిన బుధుడు ఎనిమిదవ ఇంట్లో దహనం అవుతున్నాడు. దీంతో సింహరాశి జాతకులు తీవ్ర నష్టాలను చూడబోతున్నారు. ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తికాక ఇబ్బందులు పడతారు. వారసత్వ ఆస్తుల కోసం పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దొంగతనం లేదా ఆర్థిక మోసాలకు గురవుతారు కాబట్టి జాగ్రత్త.
తులారాశి
తులారాశి వారి తొమ్మిదవ మరియు 12 గృహాలను బుధుడు పాలిస్తాడు. ఇక బుధుడు తులారాశిలో 8వ గృహంలో దహనం అవుతున్నాడు. దీనివల్ల తులారాశి జాతకులు ప్రతికూల ఫలితాలను చూస్తారు. వీరి వృత్తి, వ్యాపారాలలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు మారవలసి వస్తుంది. తీవ్ర మానసిక ఆందోళనకు ఈ సమయంలో లోనవుతారు. పనిలో తరచుగా జరిగే మార్పులు తులారాశి జాతకులకు ఇబ్బందిని కలిగిస్తుంది.
కుంభరాశి
బుధ దహనం కుంభరాశి జాతకులకు ఇబ్బందులను కలిగిస్తుంది. వీరు తమ వృత్తిపరమైన జీవితాలలో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశిలో బుధ దహనం వల్ల కుంభరాశి స్థానికులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతారు కెరీర్ లోను ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా ఫలితం రాదు. ఇది కుంభరాశి జాతకులకు నష్టాలను చేకూర్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications