మరో నాలుగు రోజుల్లో వీరికి డబ్బుల మూటలను విసిరేయనున్న బుధుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈనెల 11వ తేదీన తులారాశిలో బుధుడు సంచరించనున్నాడు. తులారాశిలో బుధుడు అక్టోబర్ 11 నుంచి 29వ తేదీ వరకు సంచరిస్తాడు. తులారాశిలో బుధ సంచారం కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను, కొన్ని రాశుల వారికి నష్టాలను కలిగిస్తుంది. తులా రాశిలో బుధ సంచారం కారణంగా లాభాన్ని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మిధునరాశి
తులరాశిలో బుధ సంచారం కారణంగా మిధున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. షేర్లు, రియల్ ఎస్టేట్ రంగంలో మదుపు చేసే వారికి విశేషమైన లాభాలు ఉంటాయి. మిధున రాశి జాతకులకు ఇది అదృష్ట కాలం.

కర్కాటక రాశి
కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా వీరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించబడతాయి. నూతన గృహాని కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. తల్లి నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు .
కన్యారాశి
కన్య రాశి లో బుధ సంచారం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఏ పని తలపెట్టిన విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతాలు పెరుగుదల ఉంటుంది. శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. పేరు ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి.
తులారాశి
తులా రాశిలో బుధ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు విదేశాల నుండి నూతన ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో వృద్ధి కనబడుతుంది. ఆర్థికంగా ఆదాయం గణనీయంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
తులా రాశిలో బుధ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఎప్పటి నుంచో వసూలు కాని బాకీలు వసూలు అవుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి తులా రాశిలో బుధ సంచారం లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు నిరుద్యోగులకు విదేశాల నుండి ఆఫర్లు వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications