శని నక్షత్రంలోకి వెళ్తూనే ఈ రాశులవారికి ధనలాభాలు ఇస్తున్న బుధుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి. అయితే ప్రతి గ్రహానికి దేనికదే చాలా ప్రత్యేకమైన స్థానం జ్యోతిషశాస్త్రంలో ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్, వ్యాపారం వంటి వాటికి ప్రతీకగా భావిస్తారు. బుధుడు వివిధ నక్షత్రాలతో, వివిధ రాశులలోను సంచారం చేసేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశుల వారి పైన కచ్చితంగా కనిపిస్తుంది.

పుష్యమి నక్షత్రంలోకి బుధుడు
బుధగ్రహానికి సంబంధించిన రోజుగా బుధవారానికి చెబుతారు. సహజంగా బుధుడిని నపుంసక గ్రహంగా చెబుతారు. అటువంటి బుధుడు జూలై 29వ తేదీన సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. బుధుడు శని నక్షత్రమైన పుష్యమి నక్షత్రంలో ఆగస్టు 2వ తేదీ వరకు ఉంటాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Mercury into the Saturn star pushyami is giving financial gains to those born under these zodiac signs

మేషరాశి
మేష రాశి వారికి పుష్యమి నక్షత్రం లోకి బుధ సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. వృత్తిలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు కుటుంబ మద్దతుతో చేసే పనులు విజయాలను సాధిస్తాయి. కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవిస్తారు. ఇది మేష రాశి వారికి అదృష్ట సమయం.

మిధున రాశి
శని నక్షత్రమైన పుష్యమి నక్షత్రంలో బుధ సంచారం కారణంగా మిధున రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా మారుతుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వివిధ మార్గాల నుండి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లవలసి ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతుతో పాటు కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశం ఉంది.

కన్యారాశి
శని నక్షత్రమైన పుష్యమి నక్షత్రంలో బుధ సంచారం కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో సానుకూలమైన ఎనర్జీతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ధార్మిక విషయాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఈ సమయంలో చేసే ప్రతి పని సత్ఫలితాలను ఇస్తుంది. కన్యా రాశి వారికి పుష్యమి నక్షత్రంలో బుధ సంచారం ఆకస్మిక ధన లాభాలను కలిగిస్తుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+