త్వరలో వీరికి సిరిసంపదలు ఇచ్చి తీరుతానని శపథం చేసిన బుధుడు!
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. అయితే అవి ఒక నిర్ణీత కాల వ్యవధిలో తమ సంచారాన్ని సాగిస్తాయి. ఈ గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక నవంబర్ మాసంలోను ముఖ్య గ్రహాల గమనం కారణంగా వివిధ రాశుల వారి జీవితాలలో పెను మార్పులు సంభవించబోతున్నాయి.
బుధుడి వక్ర గమనం
గ్రహాలలో సౌమ్యుడుగా పేరు ఉన్న బుధుడు ఈ నవంబర్ మాసంలో తిరోగమనం చెందుతున్నాడు. నవంబర్ 25న బుధుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి తిరుగులేని అధికారంతోపాటు సిరిసంపదలు వస్తాయి. బుధుడి వక్రగమనం కారణంగా లబ్ధి పొంది రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
నవంబర్ మాసంలో బుధుడి తిరోగమనం కారణంగా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల నుండి ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో అనవసర వాదనకు దూరంగా ఉండాలి.
.
మిధున రాశి
మిధున రాశి వారికి బుధుడి వక్రగమనం కారణంగా లబ్ధి జరుగుతుంది .మిధున రాశి విద్యార్థులకు ఇది గొప్ప ఊరటం ఇస్తుంది. మిధున రాశి వారి ఆదాయంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగంలో స్థాన చలనం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభం పెరుగుతుంది.
కన్యా రాశి
బుధుడి వక్రగమనం కారణంగా కన్య రాశి వారి జీవితం కొత్త టర్న్ తీసుకుంటుంది. ఈ సమయంలో పనుల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. ఇది మీకు శుభాలను ఇచ్చే సమయం అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి.
తులారాశి
బుధుడి వక్రగమనం వల్ల తులా రాశి జాతకులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రతికూల ఆలోచనలు వదిలిపెడితేనే మంచిది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. వర్తక వ్యాపారాలలో లాభాలను చూస్తారు.
వృశ్చిక రాశి
బుధుడి వక్రగమనం కారణంగా వృశ్చిక రాశి వారికి కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వర్తక వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి సుఖశాంతులు దొరుకుతాయి. వీరు జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ఇది వీరికి సరైన సమయం.
కుంభరాశి
బుధుడి వక్రగమనం కారణంగా కుంభరాశి వారికి కలిసొస్తుంది. ఈ రాశి వారు వర్తక వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. తల్లిదండ్రుల కారణంగా ఆస్తి కలిసొస్తుంది. ఇది కుంభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications