బతుకు భారంగా మారిందా.. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నాడేమో.. చెక్ చేసుకోండి!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడుని గ్రహాలకు యువరాజుగా భావిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో మేధస్సు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు, నిర్ణయం తీసుకునే శక్తిని బుధ గ్రహం ప్రభావితం చేస్తుంది. అటువంటి బుధుడు మే 31వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశించాడు. వృషభ రాశిలో బుధ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి లబ్ధిని చేకూరిస్తే, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.
బలహీనమైన బుధగ్రహం యొక్క లక్షణాలు
అయితే బుధ గ్రహం ఉన్న స్థానాలను బట్టి ఆయా రాశుల వారు ప్రతికూలతలు, అనుకూలతలను చూస్తారు.జాతక చక్రంలో ఒక గ్రహం బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు అది వ్యక్తి జీవితంపైన అనేక ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైన లక్షణాలను కనబరుస్తుంది. ఈ క్రమంలో బలహీనమైన బుధ గ్రహం యొక్క లక్షణాలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

భావ వ్యక్తీకరణ కష్టంగా, ఆత్మవిశ్వాసం తక్కువగా
జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉంటే వ్యక్తులు మాట్లాడే సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. వారు ఏది చెప్పినా అది తప్పుగా అర్థం అవుతుంది. స్పష్టంగా చెప్పడానికి కూడా వారు కష్టపడతారు. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్న సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇతరుల ముందు తమ భావాలను వ్యక్తపరచడం కూడా వారికి సవాల్ గా మారుతుంది.
చదువులో కష్టాలు, ఆర్ధిక నష్టాలు
బుధ దోషం ఉన్న వ్యక్తులు వ్యాపారం, ఉద్యోగం, కమ్యూనికేషన్ మరియు విద్యా వంటి వివిధ రంగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారు చదువు విషయంలో కూడా బలహీనంగా ఉంటారు. ఎంత ప్రయత్నించినా వారికి చదువు ఒంట పట్టదు. బుధ దోషం కారణంగా ఆర్థిక నష్టాలను కూడా చవి చూడవలసి వస్తుంది.ఉద్యోగ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
శారీరక, మానసిక సమస్యలు
జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు వివిధ శారీరక మరియు మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. జుట్టు ఊడిపోతుంది. గోర్లు విరిగిపోతాయి, చర్మ సమస్యలు బాధిస్తాయి. నిరంతర ఆర్థిక కష్టాలు వారికి ఊపిరాడనివ్వకుండా చేస్తాయి. బతుకు భారమవుతుంది. కాబట్టి జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు ఈ లక్షణాలను గుర్తించి, బుధుడిని బలోపేతం చేయడానికి చేయవలసిన నివారణలను, పరిహారాలను చేయాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications