అప్పులు, అనారోగ్యాలు, ఆత్మహత్యల దాకా.. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే జరిగేదిదే!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు మేధస్సు మరియు కమ్యూనికేషన్ కు బాధ్యత వహించే గ్రహంగా చెబుతారు. జాతకంలో బలమైన బుధ గ్రహం ఉన్న వ్యక్తులు వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. వారు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతారు. అలాకాకుండా బుధుడు దురదృష్టకరమైన గ్రహాలతో ప్రభావితం అయితే అలాంటివారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు.
బుధుడు రాహువు, కేతువు లేదా అంగారకుడుతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆది వివిధ రాశి జాతకుల జీవితాల పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉంటే కొన్ని లక్షణాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినట్లయితే బుధ గ్రహం బలహీనంగా ఉందని గుర్తించి బుధ గ్రహాన్ని బలోపేతం చేసుకోవడానికి నివారణలు పాటించాలి.

ఇంతకీ బుధ గ్రహం జాతకంలో బలహీనంగా ఉంటే కనిపించే లక్షణాలు ఏవి అంటే.. బుధ గ్రహం బలహీనంగా ఉంటే వ్యక్తి యొక్క శరీరంలో, అన్ని రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. లైంగిక వ్యాధులు సంక్రమిస్తాయి. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల వలన లైంగిక నపుంసకత్వం వస్తుంది. బుధ గ్రహం బలహీనంగా ఉంటే ఆయా వ్యక్తుల జీర్ణవ్యవస్థ దెబ్బతిని అనారోగ్యం పాలవుతారు. విపరీతమైన కడుపు నొప్పితో బాధపడతారు.
బుధ గ్రహం బలహీనంగా ఉన్నవారి జుట్టు ఊడిపోతుంది. దంతాలు, గోర్లు బలహీనపడి విరిగిపోవడం ప్రారంభమవుతాయి. వినికిడిని కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. బుధ గ్రహం బలహీనంగా ఉన్నవారు మాట్లాడడంలోనూ ఇబ్బందిని ఎదుర్కొంటారు. వ్యాపారాలలో వైఫల్యాలను, పనిలో సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు క్షీణిస్తాయి. ముఖ్యంగా అత్త, సోదరీ తదితర సంబంధాలు క్షీణించడం ప్రారంభిస్తాయి.
తప్పు చేయనప్పటికీ పరువు పోయే పరిస్థితి వస్తుంది. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే అకస్మాత్తుగా జీవితంలో డబ్బు కొరత ఏర్పడుతుంది. అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు. జాతకంలో బలహీనంగా ఉంటే తరచూ చర్మ సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి. జీవితం దుర్భరంగా తయారవుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications