రేపే కర్కాటక రాశిలో బుధుడి ఉదయం: ఈ రాశులవారికి తిరుగే లేదు!!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై నెలలో ప్రధాన గ్రహాలు వివిధ రాశుల్లోకి సంచరించనున్నాయి. కర్కాటకరాశిలో చాలా బలంగా ఉన్న బుధుడు జూలై 11వ తేదీన ఉదయిస్తాడు. బుధోదయం కారణంగా మొత్తం 12 రాశులు ప్రభావితమవుతాయి. గ్రహాలలో యువరాజుగా పిలిచే బుధుడు సంపద, తెలివి, వ్యాపార నైపుణ్యాన్ని ఇచ్చే గ్రహం. అటువంటి బుధుడు ఉదయించడం కారణంగా బుధుడి యొక్క పెరుగుదల కొన్ని రాశుల వారికి విపరీతమైన సంపదను, గొప్ప విజయాలను తీసుకువస్తుంది.
బుధుడి యొక్క పెరుగుదల వల్ల మిధున రాశి జాతకులకు అదృష్టం తలుపు తడుతుంది. బుధోదయం కారణంగా మిధున రాశిలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఎప్పటినుండో వసూలు కాని డబ్బులు తిరిగి వారి వద్దకే వచ్చి చేరుతాయి.

మిధున రాశి వారి ఆత్మ విశ్వాసం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. వారు ఆస్తులు లేదా భూముల కొనుగోలులో పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుంది. ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. ఈ సమయంలో వారు ఏ పని చేసినా వారికి విజయమే వచ్చి తీరుతుంది.
బుధోదయం కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసొస్తుంది. వారు వృతి, ఉద్యోగాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పదోన్నతులు, జీతాల పెంపు, ఆర్థిక లాభాలు పొందే అవకాశం వారికి ఉంది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న నిధులను ఈ సమయంలో పొందే అవకాశం ఉంది. పాత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వివాహ సంబంధాలలో పురోగతి మరియు వృద్ధిని ఆశించవచ్చు.
బుధోదయం కారణంగా కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి జాతకులు అనుకూలమైన ఫలితాలను విజయాలను పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఫలితంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక భారాల నుండి ఉపశమనం పొందుతారు. అటు వృత్తిపరంగానూ , ఇటు వ్యక్తిగతంగానూ గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. కన్యా రాశి జాతకులకు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications