త్వరలో వీరికి మోయలేనన్ని డబ్బుల మూటలు మోసుకొస్తానని చెప్పిన బుధుడు!
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా చెబుతారు. బుధుడు వాక్కు, బుద్ధి, వ్యాపారం మొదలైన వాటికి అధిపతి. అటువంటి బుధుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు. ఇదే క్రమంలో బుధుడు నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాడు. మే 7వ తేదీన బుధుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
బుధుడి నక్షత్ర సంచారం
అదే రోజున బుధుడు అశ్విని నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు. ఇక అశ్విని నక్షత్రంలో వారం రోజుల పాటు ఉండి ఆ తర్వాత మే 14న బుధుడు భరణీ నక్షత్రంలో కి సంచారం చేస్తాడు. బుధుడి నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
అశ్విని నక్షత్రంలో బుధుడి సంచారం మేష రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో వర్తక, వ్యాపారాలలో లాభాలను పొందుతారు. పనిచేసే చోట శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. మేష రాశి వారి ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మేష రాశి వారికి అదృష్ట సమయం.
సింహరాశి
బుధుడి నక్షత్ర మార్పు సింహరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. భూములు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి సమయం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వారి మద్దతు లభిస్తుంది. పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపార వర్గాలకు ఈ సమయం అదృష్ట సమయంగా చెప్పవచ్చు.
తులారాశి
తులా రాశి జాతకులకు బుధుడి నక్షత్ర మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుంది. తులా రాశి జాతకులకు విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తుంది. ప్రయాణాలు చేసే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. పనిచేసే చోట సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో తులా రాశి జాతకులకు పురోగతికి, ఆర్థిక ప్రగతికి అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications