మే నెలలో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతారని చెప్పిన బుధుడు!

జ్యోతిష్య శాస్త్రంలో బుధ సంచారాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. బుధుడు సూర్యుడు చుట్టూ తిరుగుతూ భూమి మరియు సూర్యుని మధ్య సంచారం చేస్తాడు. బుధుడు వ్యాపారాలకు, కమ్యూనికేషన్ కు కారకుడు. బుధ సంచారం ముఖ్యంగా వ్యాపారాల మీద కమ్యూనికేషన్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది.బుధుడు తెలివితేటలు, తర్కానికి కూడా ప్రతీకగా చెబుతారు. బుధ సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది.

బుధ సంచారం
మిధున మరియు కన్యా రాశులకు అధిపతి అయిన బుధుడు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. ఇక మే నెలలో బుధుడు ఏడవ తేదీన మేషరాశిలోకి సంచరిస్తాడు. మే 23వతేదీన మేషరాశిని వదిలి వృషభరాశిలో సంచారాన్ని మొదలుపెడతాడు. బుధుడు రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. బుధసంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Mercury said that people of these zodiac signs will be happy in May

మేషరాశి
మేషరాశి జాతకులు బుధ సంచారం కారణంగా లబ్ధిని పొందుతారు. మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉన్నా, బుధ సంచారం కారణంగా కాస్త ఉపశమనం కలుగుతుంది. మే నెలలో ద్వితీయార్థం మేష రాశి వారికి బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. బుధుడు శుభ స్థానంలో ఉన్నవారికి ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి.

వృషభ రాశి
బుధ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి వారు పదోన్నతులు పొందుతారు. కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి. వీరి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో ఎదుగుదల స్పష్టంగా గోచరిస్తుంది. కుటుంబంతో సంతోషి జీవితాన్ని గడుపుతారు . ఈ సమయం వృషభ రాశి వారికి అన్ని విధాల శుభ సమయం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బుధ సంచారం కారణంగా గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కర్కాటక రాశిలో వర్తక వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఏ పని చేసిన ఈ సమయంలో మంచి ఫలితం ఉంటుంది. కొత్త వ్యాపారాలను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం.

కుంభరాశి
కుంభ రాశి వారికి బుధ సంచారం కారణంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కుంభ రాశి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. ఉద్యోగాలు చేసేవారు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందుతారు. ఇది కుంభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+