మేషరాశిలో బుధుడు.. ఈ రాశులవారు అప్పులపాలవుతారు.. జాగ్రత్త
గ్రహాల సంచారం కారణంగా వివిధ రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు కలుగుతాయి. మే 10వ తేదీన సాయంత్రం 6:39 నిమిషాలకు మేషరాశిలో బుధుడు ప్రవేశిస్తాడు. అయితే ఈ బుధ సంచారం కొన్ని రాశులకు తీవ్రమైన ఆర్థిక సమస్యలను తీసుకొని వస్తుంది. బుధ సంచారం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశిలో బుధ సంచారం కారణంగా మేషరాశి జాతకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. వర్తక వ్యాపారాలలో ఎక్కువ లాభాలను పొందలేరు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అవసరాలను తీర్చుకోవడానికి మీరు అప్పు చేయాల్సి వస్తుంది. ఆర్ధిక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థికపరమైన అన్ని విషయాలలోనూ మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

వృషభ రాశి
మేషరాశిలో బుధ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికపరంగా తీవ్రమైన పరిస్థితులను చూడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆర్థిక నష్టాలు చూడాల్సి వస్తుంది. అనుకూలమైన ఫలితాలు రావు. పనిచేసే చోట వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఏ పని చేసిన విజయవంతం కాలేరు. డబ్బుకు సంబంధించిన విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఆర్థిక నష్టాలను భరించాల్సి ఉంటుంది
కన్యారాశి
మేషరాశిలో బుధ సంచారం కారణంగా కన్య రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అవసరాలను తీర్చడానికి అప్పు తీసుకురావాల్సి వస్తుంది. బాధ్యతలు పెరగడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ సమయం మీకు చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో చాలా టెన్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి
మేషరాశిలో బుధ సంచారం వృశ్చిక రాశి వారికి ఇబ్బందులను తెస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. డబ్బు సంపాదించడంలో మీరు విఫలమవుతారు. మీ అవసరాలు మరియు బాధ్యతలను తీర్చడానికి డబ్బు అప్పు చేయవలసి వస్తుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక భారం గణనీయంగా పెరుగుతుంది.
కుంభరాశి
మేషరాశిలో బుధ సంచారం కారణంగా కుంభరాశి జాతకులు వర్తక వ్యాపారాలలో నష్టం చూడాల్సి వస్తుంది. కెరీర్లో ప్రతికూలమైన ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏ పని చేసిన ప్రతికూల ఫలితాలే వస్తాయి
మీనరాశి
మేషరాశిలో బుధ సంచారం మీనరాశి జాతకులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తుంది. ఈ జాతకుల ఖర్చులు ఈ సమయంలో విపరీతంగా పెరుగుతాయి. అనవసరమైన విషయాలకు చాలా డబ్బులను ఖర్చు చేస్తారు. స్థానికులు వారి అజాగ్రత్త కారణంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు. ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications