7 రాశులవారికి జూన్ 22 వరకు మహారాజయోగం వరమిచ్చిన బుధుడు!
మే 30, 2026న గ్రహాల అధిపతి బుధుడు తన స్వక్షేత్రమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 22 వరకు ఈ రాశిలోనే సంచరించనున్న బుధుడు తెలివితేటలు, వ్యాపారం, విద్య, సంభాషణ నైపుణ్యం, ఆర్థిక లావాదేవీలకు కారకుడైనందున ఏడు రాశుల వారికి మంచి ఫలితాలను అందించనున్నాడు.
బుధ సంచారంతో విశేష యోగాలు
జ్యోతిష్య నిపుణుల ప్రకారం వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, కుంభం రాశుల వారికి ఈ బుధ గోచారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో 'భద్ర మహా పురుష రాజయోగం’, 'విపరీత రాజయోగం’ వంటి శుభయోగాలు ఏర్పడి ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత రంగాల్లో మెరుగైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

వృషభం:
ధనాధిపతి బుధుడు ధన స్థానంలోకి రావటంతో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. నైపుణ్యాలు పెరిగి, ఉద్యోగం-వ్యాపారంలో సునాయాసంగా ప్రగతి సాధిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడంతో పాటు పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి.
మిథునం:
స్వరాశిలో బుధుడు సంచరించడం వల్ల 'భద్ర మహా పురుష యోగం’ ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం పెరిగి, ఉన్నత వ్యక్తులతో సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారం, షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో ఆనందం నిండి ఉంటుంది.
సింహం:
లాభ స్థానంలో బుధుడి ప్రవేశం 'మహా భాగ్య యోగం’ను ఇస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా ముగుస్తాయి. కెరీర్‌లో విజయాలు, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
కన్య:
దశమ స్థానంలో బుధుడు బలంగా ఉండటం వల్ల 'భద్ర మహా పురుష యోగం’ ఏర్పడుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని పురోగతి, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం, ఉన్నత స్థాయి పరిచయాలు లభిస్తాయి.
తుల:
భాగ్య స్థానంలో బుధుడి సంచారం విదేశీ యోగాన్ని కలిగిస్తుంది. విదేశాల నుంచి మంచి ఆఫర్లు, ఉద్యోగ స్థిరత్వం వస్తాయి. తండ్రి తరపు ఆస్తి లాభం, కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తాయి.
ధనుస్సు:
'భద్ర మహా పురుష యోగం’తో పాటు 'విపరీత రాజయోగం’ ఏర్పడుతుంది. రాజపూజ్యాలు, గౌరవం పెరిగి, ఆదాయం బహుముఖాల్లో వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.
కుంభం:
పంచమ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఆకస్మిక ధనలాభాలు, ఆర్థికాభివృద్ధి, ప్రముఖులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి.జ్యోతిష్య నిపుణులు ఈ కాలంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications