రెండు రోజులు ఆగండి.. ఈ రాశులవారు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. ఫిబ్రవరి 22న బుధుడు గురుడి నక్షత్రమైన పూర్వభాద్రలోకి ప్రవేశిస్తున్నాడు. తొమ్మిది గ్రహాలలో యువరాజుగా, తెలివి, వ్యాపారానికి ప్రతీకగా బుధుడిని పరిగణిస్తారు. ఈ నక్షత్ర మార్పు ద్వాదశ రాశులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
పూర్వాభాద్ర నక్షత్రంలో బుధ సంచారం
బుధుడు గురుడి నక్షత్రమైన పూర్వాభాద్రలో సంచారం చేయటం వలన కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను అందిస్తుంది. బుధుడి అనుగ్రహంతో ఫిబ్రవరి చివరి రోజుల్లో కొన్ని రాశులవారు కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వారు చేపట్టే పనుల్లో విజయం వరిస్తుంది. ఇది అన్ని విధాలా ఆయా రాశులవారికి మేలు చేస్తుంది.

వృషభరాశి
వృషభ రాశి వారికి బుధుడి సంచారం సానుకూలంగా ఉంటుంది. వీరికి వృత్తిపరంగా గొప్ప పురోగతిని అందిస్తుంది. వీరికి కొత్త బాధ్యతలు లభించి, సహోద్యోగుల మద్దతు ఉంటుంది. వృషభ రాశి జాతకుల ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. కృషికి తగిన ప్రతిఫలం పొందుతారు.
తులా రాశి
తులా రాశి వారికి బుధుడి నక్షత్ర మార్పు అన్ని విధాలా లబ్ది చేకూరుస్తుంది. ఇది తులా రాశి జాతకుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ సమయంలో నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఉన్నత విద్య ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి బుధుడి సంచారం అనేక లాభాలను ఇస్తుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది . పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా మారుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలని సూచించబడింది.
మకర రాశి
మకర రాశి వారికి బుధ సంచారం శుభప్రదంగా ఉంటుంది. వారి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుని, సమాజంలో గౌరవం పొందుతారు. విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కుటుంబ వివాదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు నెలాఖరుకు శుభవార్తలు అందవచ్చు.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.












Click it and Unblock the Notifications